కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి శ్రీ రాఘవ దర్శకత్వంలో నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ `ఎన్జీకే` కాగా… మరొకటి కె.వి.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `కాప్పాన్`. ఈ రెండు సినిమాలు కూడా చిత్రీకరణ తుది దశకు చేరుకున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్న `ఎన్జీకే`… ఈద్ సందర్భంగా జూన్ మొదటి వారంలో విడుదల కానుందని కోలీవుడ్ టాక్. ఇక సాయేషా హీరోయిన్‌గానూ, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, ఆర్య ఇతర ప్రధాన పాత్రల్లోనూ నటిస్తున్న `కాప్పాన్`ని ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
ఆసక్తికరమైన విషయేమిటంటే… ఇదే పంద్రాగస్టున యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన త్రిభాషా చిత్రం `సాహో` కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకే రోజున రాబోతున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందుకోవాలని ఆకాంక్షిద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=pzkg9SrdKcw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: