రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఓ కీలకఘట్టం ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మూవీ పోస్టర్స్ దగ్గర నుండి ఈసినిమాలోని పాటలతో, టీజర్ తో, ట్రైలర్ తో సినిమాకు ఓ రేంజ్ లో క్రేజ్ తీసుకొచ్చాడు వర్మ. ఇక ఈ నెల 22వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమాకు రిలీజ్ విషయంలో మాత్రం కాస్త ఇబ్బందులు తలెత్తాయి. మరి లీగల్ గా వెళుతున్న ఈ వ్యవహారంలో ఆఖరికి ఏమవుతుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే రిలీజ్ విషయంలో ఎన్ని ఇష్యూస్ తలెత్తినా వర్మ మాత్రం ఎక్కడా తగ్గకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అనుకున్న డేట్ కు సినిమా రిలీజ్ అవుతుందో? లేదో? కానీ మిగిలిన కార్యక్రమాలు అన్నీ పూర్తి చేస్తున్నాడు. దీనిలో భాగంగానే తాజాగా ఆడియో రిలీజ్ వేడుకకు వేదికను ఫిక్స్ చేసి తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఆడియో రిలీజ్ ను కడపలో విడుదల చేస్తామని.. ఈ వేడుకకు కడప వేదిక కానుందని. కడపలో భారీ బహిరంగ సభలో ఈ వేడుకను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ‘‘వెన్నుపోటు అలియాస్ ఎన్టీఆర్ నైట్’’గా నామకరణం చేశారు. అయితే ఆడియో రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. మరి ఇప్పటికే వర్మ పనులకు ఎగిసి పడుతున్న తెలుగు తమ్ముళ్లు.. దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం.
లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో రిలీజు ఈవెంట్ కడప లో ఒక గొప్ప బహిరంగ సభలో చెయ్యబడుతుంది ..ఈవెంట్ పేరు
“వెన్ను పోటు” అలియాస్ ఎన్టీఆర్ నైట్ .
ఈవెంట్ డేటు అతి త్వరలో తెలియచెయ్యబడుతుంది ..జై ఎన్టీఆర్ #LakshmiNTR pic.twitter.com/ocVYUrkD6t
— Ram Gopal Varma (@RGVzoomin) March 16, 2019
కాగా ఇక ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తుండగా.. కీలకమైన చంద్రబాబు నాయుడు పాత్రలో వంగవీటి ఫేం శ్రీతేజ్ కనిపించనున్నాడు. ఇక ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్ నటిస్తున్నాడు.
[youtube_video videoid=WbtiDxR1DZY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: