సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో సైరా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. గత కొద్ది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న సైరా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రాజగురువు ‘గోసాయి వెంకన్న’ పాత్రలో అమితాబ్ కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా జరుగుతున్న షెడ్యూల్ లో షూటింగ్ ను పూర్తి చేశాడు బిగ్ బి అమితాబ్ బచ్చన్. గతంలో ఓ షెడ్యూల్ ను పూర్తి చేసిన బిగ్ బి.. గత కొద్ది రోజులుగా మరో షెడ్యూల్ లో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన ట్విట్టర్ ద్వారా బిగ్ బి కి కృతజ్ఞతలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
It’s a WRAP with #BigB…What an amazing and INCREDIBLE journey it has been. Thank you sir for being part of #SyeRaa..Working with you was such a great honor 🙏🏻🙏🏻 @SrBachchan #MuchRespect #DreamComeTrue pic.twitter.com/uPdsQUtCpt
— SurenderReddy (@DirSurender) March 16, 2019
కాగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయన తార కథానాయికగా నటిస్తుండగా , జగపతి బాబు , తమన్నా, విజయ్ సేతుపతి, సుధీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థం లో సినిమా రిలీజ్ కానుంది.
[youtube_video videoid=Xt7j28oBAh8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: