హేమంత్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్, అంజలి, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో సైలెన్స్ అనే సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. మార్చిలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా తెలుగు, తమిళ్ మరియు ఇంగ్లీష్ లో ఒకేసారి షూటింగ్ జరుపుకోనుంది. అంతేకాదు కాదు తెలుగు, తమిళం, హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణుల తో నిర్మితమవుతున్న తొలి క్రాస్ ఓవర్ చిత్రమిది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా… ఈ సినిమాలో హాలివుడ్ మూవీ కిల్ బిల్ లో నటించిన ‘మైఖేల్ మాడ్సన్’ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఆ విషయాన్నే అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఇంటర్నేషనల్ ఫిలిం సైలెన్స్ లో ‘మైఖేల్ మాడ్సన్’ నటిస్తున్నాడని అఫీషియల్ గా తెలిపారు.
కాగా హేమంత్ దర్శకత్వం లో హార్రర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చనున్నాడు. ఇంకా ఈ సినిమా ఎక్కువభాగం చిత్రీకరణ అమెరికాలో జరగనుంది. దసరాకు సినిమా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
[youtube_video videoid=JkbycyaSDD8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: