మరోసారి మనసు దోచుకున్న మహర్షి

Mahesh Babu Fullfils Desire Of a Fan,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu Meets His Fan,SuperStar Mahesh Babu Fulfils His Fan Dreams,Mahesh Babu Wishes to His Fan,Mahesh Babu Latest Updates
Mahesh Babu Fullfils Desire Of a Fan

సూపర్ స్టార్ మహేష్ బాబు అటు సినిమాల్లోనే కాదు ఇటు సేవా కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా ఉంటారని మనకు చాలా సందర్భాల్లోనే నిరూపితమైంది. కుడి చేతితో చేసే సాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అన్నదాన్ని బాగా ఫాలో అవుతాడు మహేష్. అందుకే ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా సైలెంట్ గా ఉంటాడే తప్పా.. పబ్లిసిటీ చేసుకునే మనిషి కాదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మహేష్ కు చిన్నపిల్లలంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. వారికోసం ఎన్నో సేవలు అందించారు. ఇటీవల తన పెళ్లి రోజు సందర్భంగా.. అంధత్వంతో బాధపడుతున్న 650 మంది చిన్నారులకు విందు భోజనం పెట్టి ఉదారతను చాటుకున్న మహేష్. తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.

శ్రీకాకుళానికి చెందిన పర్వీన్ బేబి అనే చిన్నారి క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈ చిన్నారికి మహేష్ అంటే చాలా ఇష్టమట. ఆ విషయం తెలుసుకున్న మహేష్.. శ్రీకాకుళం వెళ్లి పర్వీన్‌ని కలిసి చాలా సేపు సమయాన్ని అక్కడే గడిపాడు. పర్వీన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

[subscribe]

[youtube_video videoid=hnyNenuG-BM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.