రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమా విషయంలో ఉన్న డౌట్లన్నింటికీ రాజమౌళి మొన్న జరిగిన ప్రెస్ మీట్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. దీంతో దాదాపు ఈ సినిమా విషయంలో వస్తున్న, వచ్చే పుకార్లకు ఇంక బ్రేక్ పడినట్టే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకోగా.. మూడో షెడ్యూల్ కూడా త్వరలోనే జరుపుకోనున్నారు. కోల్ కత్తాలో దాదాపు 40 రోజుల పాటు ఇద్దరు హీరోలతో రాజమౌళి ఈ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అలియా భట్.. ఒక కీలకమైన పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నట్టు తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో షూటింగ్ చేస్తున్న రాజమౌళి మరికొద్ది రోజులు వీరిద్దరితోనే కీలక సన్నివేశాలు తీయనున్నాడట. అలియా, అజయ్ దేవగన్ ఈ ఏడాది మధ్య నుండి షూటింగ్ లో పాల్గొననున్నారట. ఆ తరువాత మిగిలిన వారితో షూటింగ్ ఉండబోతుందట. ఇక ఈ ఏడాది చివరి లోపు షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సినిమా గ్రాఫిక్స్ వర్క్ మొత్తం పూర్తి చేసి జులై 30 వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నారు.
కాగా డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలతో పాటు మరికొన్ని ఇండియన్ లాంగేజ్వస్ లో కూడా రిలీజ్ చేయనున్నారు.
[youtube_video videoid=YmvQfUoOftE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: