ఒకే సమయంలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు అగ్ర కథానాయకులు… రెండు వేర్వేరు చిత్రాల కోసం పిరియాడిక్ టచ్ ఉన్న కాన్సెప్ట్‌లు ఎంచుకుని… వాటితో బిజీగా గడపడం అరుదైన విషయంగా చెప్పుకోవాలి. అలా… రేర్ ఫీట్‌తో టాలీవుడ్ ఇండ్రస్ట్రీనే కాదు… ఓవరాల్‌గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అటెన్షన్‌నే తమ వైపుకు తిప్పుకుంటున్నారు ఇద్దరు `మెగా` హీరోలు. వారే… మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక వైపు మెగాస్టార్ చిరంజీవి తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న `సైరా నరసింహారెడ్డి`ని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తుంటే… మరో వైపు ఆయన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రీ-ఇండిపెండెన్స్ టచ్ ఉన్న మెగా ప్రాజెక్ట్ `ఆర్ ఆర్ ఆర్` (ఇందులో యంగ్ టైగర్ యన్టీఆర్ మరో హీరో)లో యువ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ రెండు కూడా వారి కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్ ఫిల్మ్స్ కావడం విశేషం. అలాగే… పాన్ ఇండియా అప్పీల్ ఉన్న ఈ చిత్రాలు పలు భాషల్లో విడుదలవుతుండడం ఆసక్తిదాయకం.
అంతేకాదు… `సైరా నరసింహారెడ్డి` ఈ ఏడాది ద్వితీయార్ధంలో (దసరా అని టాక్) విడుదల కానుండగా… ఏడాది గ్యాప్‌లోనే `ఆర్ ఆర్ ఆర్` జూలై 30, 2020న సెల్యులాయిడ్ పైకి రానుంది. మరి… ఒక సంవత్సరం వ్యవధిలోనే వస్తున్న ఈ ప్రీ-ఇండిపెండెన్స్ పిరియాడికల్ డ్రామాలు బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులకు కేంద్రబిందువులుగా నిలుస్తాయో చూడాలి.
[youtube_video videoid=qqwQveU3DHA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: