ఆరోసారి రిపీట్ చేస్తున్న రాజ‌మౌళి

SS Rajamouli To Repeat His Summer Sentiment For The Sixth Time With RRR Movie,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Will Rajamouli Repeat the Summer Sentiment For RRR Movie,Latest Updates on RRR Movie,RRR Telugu Movie Latest News,Rajamouli Same Sentiment Workout For RRR Movie
SS Rajamouli To Repeat His Summer Sentiment For The Sixth Time With RRR Movie

తెలుగునాట నంబ‌ర్ వ‌న్ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతున్నాడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి. ఇప్ప‌టివ‌ర‌కు 11 చిత్రాల‌ను రూపొందించిన జ‌క్క‌న్న‌… ఆయా సినిమాల‌తో ఘ‌న‌విజ‌యాల‌ను న‌మోదు చేసుకున్నాడు. ప్ర‌స్తుతం 12వ చిత్రంగా `ఆర్ ఆర్ ఆర్‌`ను తెర‌కెక్కిస్తున్నాడు. యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో సిస‌లైన మ‌ల్టీస్టార‌ర్‌గా ఈ భారీ బ‌డ్జెట్ మూవీ తెర‌కెక్కుతోంది. ఇదిలా ఉంటే… ఈ సినిమా విడుద‌ల తేదిని జూలై 30, 2020గా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన చిత్ర‌మేమిటంటే… ఈ జూలై నెల‌లో రాజ‌మౌళి నుంచి ఆరో చిత్ర‌మిది. గ‌తంలో ఇదే నెల‌లో `సింహాద్రి` (2003), `మ‌గ‌ధీర‌` (2009), `మ‌ర్యాద‌రామ‌న్న‌` (2010), ఈగ (2012), బాహుబ‌లి – ది బిగినింగ్ (2015) సినిమాలు విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించాయి. ఈ నేప‌థ్యంలో… ఆరో చిత్రంగా వ‌స్తున్న `ఆర్ ఆర్ ఆర్‌` కూడా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ కుంభ‌వృష్టి కురిపిస్తుందేమో చూడాలి. మొత్తం 12 రిలీజ్‌ల్లో… ఆరు చిత్రాలు ఒకే నెల‌ను టార్గెట్ చేసుకోవ‌డం విశేష‌మ‌నే చెప్పాలి. మ‌రి…రాజ‌మౌళికి, ఈ జూలై నెల‌తో ఉన్న ప్ర‌త్యేక అనుబంధం ఏమిటో!

[subscribe]

[youtube_video videoid=9cnLpTOpP0w]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.