హర్రర్ జోనర్ సినిమా అంటే మాక్సిమం ఎంటర్టైన్మెంట్ – మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. అందుకే ప్రేమకథాచిత్రం తరువాత వరుసగా ఆ జోనర్ మీద ముఖం మొత్తే స్థాయిలో సినిమాలు వచ్చాయి. ఈ మధ్య ఆ ఊపు కొంత వరకు తగ్గి మరలా ఊపందుకుంది హారర్ జోనర్. తాజాగా ఆ కోవకు చెందిన చిత్రం “వేర్ ఈస్ ద వెంకటలక్ష్మి” ఈ రోజు విడుదలైంది. కొంత గ్యాప్ తర్వాత రావటంతో పాటు మంచి పబ్లిసిటీ కారణంగా ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బజ్ బాగానే ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ రోజు విడుదలైన
“ వేర్ ఇస్ ది వెంకటలక్ష్మి” ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక భయంకరమైన జంట హత్యలతో ఓపెన్ అవుతుంది ఈ చిత్ర కథ. ఆ హత్య ఎందుకు జరిగింది? అనే సస్పెన్స్ ను అలా వదిలేసి శేఖర్( రామ్ కార్తీక్), గౌరీ( పూజిత పొన్నాడ) ల లవ్ ట్రాక్ మీద ఓపెన్ చేసాడు దర్శకుడు కిషోర్ . బెల్లంపల్లి అనే ఊరిలో పండుగాడు( ప్రవీణ్)
చంటిగాడు( రఘు నందన్) అనే ఇద్దరు ఆవారా ఫ్రెండ్స్ శేఖర్ కు మంచి మిత్రులు. అందరిని అల్లరి పెట్టి, ఏడిపించే చంటిగాడు, పండుగాడు శేఖర్ కు మాత్రం మంచి మిత్రులు. శేఖర్ గౌరీ ల ప్రేమ వ్యవహారానికి సలహాలిస్తూ, సహకరిస్తూనే వాళ్లను దగ్గర చేయటం కోసం కొన్ని తిక్క పనులు కూడా చేస్తారు. వాళ్ల పిచ్చి చేష్టల పర్యవసానంగా హీరో హీరోయిన్ల మధ్య అపార్ధాలు ఏర్పడతాయి. ఇదే సమయంలో ఆ వూరికి కొత్తగా ఒక స్కూల్ టీచర్ వెంకటలక్ష్మి( రాయ్ లక్ష్మి) వస్తుంది. ఆమె అందచందాలకు, సెక్స్ అప్పీలుకు పడిపోయిన చంటిగాడు, పండుగాడు ఆమె వెంట పడతారు. ఆ ఊర్లో ఆమెకు ఉండటానికి ఇల్లు ఏర్పాటు చేయటమే కాకుండా తమ ఇద్దరిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి తమ బామ్మ (అన్నపూర్ణమ్మ) ను వెంట పెట్టుకొని ఆమెతో సంబంధం మాట్లాడటానికి వెళ్తారు. కానీ ఆ ఇంట్లో చంటి గాడికి , పండు గాడికి కనిపించే వెంకటలక్ష్మి బామ్మకు మాత్రం కనిపించదు.
వాళ్ళిద్దరికీ తప్ప మరి ఎవరికీ కనిపించని వెంకటలక్ష్మి మనిషి కాదు.. దెయ్యం అని త్వరలోనే వాళ్లకు అర్థం అవుతుంది. ఆ దెయ్యం బారినుండి తప్పించుకోవటానికి చంటిగాడు, పండుగాడు ఏం చేశారు? అసలు ఆ దెయ్యం ఎవరు? అది వీళ్ళిద్దరినే ఎందుకు టార్గెట్ చేసింది? పొరుగూరు అయిన నాగం పేట లో వీరారెడ్డి (పంకజ్ కేసరి) ఇంటిలోని బెడ్ రూమ్ లోని ఇనుప పెట్టెలో ఉన్న చిన్న చెక్క పెట్టేను తెచ్చి ఇస్తేనే మిమ్మల్ని వదిలి పెడతాను అని కండీషన్ పెడుతుంది ఆ దెయ్యం. ఇంతకూ ఆ పెట్టె లో ఉన్నది ఏమిటి? అసలు ఈ వీరారెడ్డి ఎవరు? ఇత్యాది సందేహాలకు సమాధానంగా నిలుస్తుంది ఈ చిత్ర పతాక సన్నివేశం.
హారర్ కామెడీగా ఈ చిత్రాన్ని మలచ దలచుకున్న దర్శకుడు కిషోర్ ఆ ప్రయత్నంలో చాలా వరకు మంచి ప్రజెంటేషన్ ఇచ్చాడు. మంచి టైమింగ్ ఉన్న కమెడియన్స్ గా ఎదుగుతున్న ప్రవీణ్, రఘునందన్ లతో ఒక డిఫరెంట్ కామెడీ హర్రర్ ను ట్రై చేసిన కిషోర్ ద్వితీయార్థంలో కొంత గ్రిప్ మిస్ అయ్యాడు. వెంకటలక్ష్మి మనిషి కాదు దెయ్యం అని రివీల్ చేసిన తరువాత వచ్చే సన్నివేశాలలో ఉండాల్సిన డెప్త్, కంటెంట్ వెయిట్ లేకపోవటంతో ఇంటర్వెల్ తరువాత చాలా సన్నివేశాలు తేలిపోయాయి. ఈ సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. స్క్రీన్ ప్లే , కామిడీ బాగుంది … కామెడీ హర్రర్ జోనర్లో చేసిన ఒక చిన్న ప్రయత్నంగా ఒక వర్గం ప్రేక్షకులను రెండు గంటలపాటు ఎంటర్టైన్ చేస్తుంది ఈ సినిమా.
ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ చాలా చక్కగా నటించారని చెప్పవచ్చు. ముఖ్యంగా చంటిగాడు పండుగాడు గా నటించిన ప్రవీణ్, రఘునందన్ లు బాగా చేశారు. వాంప్ పాత్రలకు పెట్టింది పేరైన లక్ష్మీ రాయ్ వెంకటలక్ష్మి పాత్రలో బాగుంది.. బాగా చేసింది… అలాగే గౌరీ గా పూజిత పొన్నాడ పర్ఫామెన్స్ లోనూ, అందచందాల ఆరబోతలోనూ రాయ్ లక్ష్మి కి ఏమాత్రం తగ్గలేదు. వీరారెడ్డి గా పంకజ్ కేసరి, యంగ్ హీరో గా రామ్ కార్తీక్, ఇతర పాత్రల్లో అన్నపూర్ణమ్మ, రంగస్థలం మహేష్, వేణుగోపాల్, జెమిని సురేష్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఈ సినిమా విషయంలో హైలెట్ గా చెప్పుకోవాల్సింది హర గౌరీ సంగీతం. పాటల్లోనూ, ఆర్ఆర్ లోనూ సంగీత దర్శకుడు హర గౌరీ మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. అలాగే కథ, మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చిన కిరణ్ కథ విషయంలో కంటే మాటలు, స్క్రీన్ ప్లే విషయంలో మంచి మార్కులు కొట్టేశాడు. మిగిలిన టెక్నికల్ అండ్ మేకింగ్ స్టాండర్డ్స్ విషయంలో the film is up to the mark అని చెప్పవచ్చు.
[wp-review id=”17108″]
[youtube_video videoid=jctY9sral0k]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: