నటనలోనే కాదు వ్యక్తిత్వంలో కూడా శభాష్ అనిపించుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇప్పుడు జీఎస్టీ అధికారులు మహేష్ బాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా ప్రేక్షకుల నుంచి జీఎస్టీ పేరుతో అదనంగా వసూలు చేసిన రూ.35.66 లక్షలను ‘వినియోగదారుల సంక్షేమనిధి’కి చెల్లించాడు మహేష్ బాబు. దీంతో మహేష్‌బాబును జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ ప్రశంసించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మల్టీ సినిమా థియేటర్ కాంప్లెక్స్ (ఏఎంబీ సినిమాస్) యజమానులైన మహేష్‌బాబు, సునీల్ నారంగ్‌లు తమది కాని లాభాన్ని గుర్తించి.. తిరిగి చెల్లించినందుకు అభినందిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎవరూ ఇలా బాధ్యతగా జీఎస్టీని వెనక్కు తిరిగి ఇవ్వలేదని.. మహేష్‌బాబు, సునీల్‌లు అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరుల్లోని థియేటర్ల యజమానులపై ఈ నిర్ణయం సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది. మొత్తానికి మహేష్ రియల్ లైఫ్ కూడా హీరో అయ్యారన్నమాట.
[youtube_video videoid=9Q_l8Ul-raA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: