తమిళంలో విజయం సాధించిన `రాచ్చసన్` చిత్రాన్ని… తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని `రైడ్` ఫేమ్ రమేష్ వర్మ రూపొందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కేరళకుట్టి అనుపమ పరమేశ్వరన్‌ని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా వంటి ప్రముఖ కథానాయికల పేర్లు వినిపించినా… ఇప్పుడా అవకాశం అనుపమకి దక్కిందని టాలీవుడ్ టాక్. త్వరలోనే అనుపమ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒరిజనల్ వెర్షన్‌లో అమలా పాల్ పోషించిన పాత్రలో అనుపమ కనిపించనుంది. నటనకు అవకాశమున్న పాత్ర కావడంతో… అనుపమ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. కాగా… `అ ఆ`, `ప్రేమమ్`, `శతమానం భవతి` చిత్రాలతో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకున్న అనుపమ… గత ఏడాది విడుదలైన `హలో గురు ప్రేమ కోసమే` తరువాత నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ రీమేక్‌తో అనుపమ మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తుందేమో చూడాలి.
[youtube_video videoid=Zg2sB1WwJf8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: