Star is the Pillar and Star the Puller అని ప్రగాఢంగా విశ్వసించే నిర్మాతలలో విజయ బాపినీడు ఒకరు. అందుకే సినిమా అనే భవంతికి ‘పిల్లర్’ సినిమానే బండికి ‘పుల్లర్’ స్టారే అంటారు దివంగత దర్శక నిర్మాత విజయ బాపినీడు. అలాగని ఆయన నిర్మించిన, దర్శకత్వం వహించినవన్నీ స్టార్ బేస్డ్ చిత్రాలు కాదు. విజయ బాపినీడు నిర్మాతగా, దర్శకుడిగా చాలా చిన్న చిత్రాలు, ప్రయోగాత్మక ప్రయోజనాత్మక చిత్రాలు అందించినప్పటికీ మెగాస్టార్ చిరంజీవితో ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుండి విజయ బాపినీడు నిర్మాతగా గొప్ప కంఫర్ట్ ఎంజాయ్ చేశారు. ఒక స్టార్ కు నిర్మాతకు మధ్య ఉండవలసిన సత్సంబంధాలకు ప్రతీకగా ఉండేది వారిద్దరి అనుబంధం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిరంజీవి హీరోగా పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు, హీరో, మగధీరుడు, ఖైదీ నెంబర్ 786, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ చిత్రాలను నిర్మించారు విజయ బాపినీడు. నిర్మాతగా ఉన్న ఆయన దర్శకుడు గా మారటానికి కూడా కారణం చిరంజీవి.
పత్రికా రంగంలో విజయవంతమైన ఎడిటర్ అండ్ పబ్లిషర్ కూడా అయిన విజయబాపినీడు “చిరంజీవి” అనే ఒక ఎక్స్క్లూజివ్ డెడికేటెడ్ మ్యాగజైన్ ను కొన్ని సంవత్సరాల పాటు నుండి నిర్వహించారు. ఒక నిర్మాత ఒక స్టార్ కోసం ఇలా ఒక పత్రికను ఎక్స్క్లూజివ్ గా నడపటం పత్రికా రంగ చరిత్రలో First and last of its kind అని చెప్పవచ్చు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా పటిష్టమైన పరస్పర గౌరవాభిమానాలు ఉన్న ఒక స్టార్ ను ఒక నిర్మాతను చూడటం చాలా అరుదు.
అందుకే ఈరోజు విజయ బాపినీడు మరణించారన్న వార్త తెలియగానే చిరంజీవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారిద్దరి అనుబంధానికి ప్రతీకగా నిలిచే కొన్ని రేర్ ఫోటోలు మీకోసం.
ఫోటో కర్టసీ: నారాయణ విజయబాపిణీడు పర్సనల్ అండ్ సీనియర్ స్టిల్ ఫోటోగ్రాఫర్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: