సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా “ఎబిసిడి” (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ సినిమాను మార్చి 1వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు గతంలో రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మారినట్టు తెలుస్తోంది. సినిమా రిలీజ్ డేట్ ను మార్చి 21వ తేదీకి వాయిదా వేశారు.
కాగా సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో అల్లు శిరీష్ సరసన ఈ సినిమాలో ‘కృష్ణార్జున యుద్ధం’ ఫేమ్ రుక్సర్ థిల్లాన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు. మరి మలయాళంలో హిట్టయిన ఈ సినిమాతో అల్లు శిరీష్ హిట్ కొడతాడో లేదో చూద్దాం.
[youtube_video videoid=6ZBLDETIFDM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: