లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన వర్మ

RGV About Lakshmi's NTR Trailer Release,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Telugu Movies Updates,Lakshmi's NTR Trailer Release Date Announced,Lakshmi's NTR Trailer Release Date Fixed,RGV Revealed Release Date of Lakshmi's NTR Trailer,Lakshmi's NTR Movie Latest Updates,Lakshmi's NTR Trailer Release Date Confirmed,Lakshmi's NTR Trailer Release Date Locked
RGV about Lakshmi's NTR Trailer Release

మొత్తానికి రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టే చేశాడుగా. లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడవుతుందంటే… ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా రిలీజ్ డేట్ పై అది ఆధారపడి ఉంటుందని…మహానాయకుడు రిలీజ్ డేట్ ప్రకటించిన వెంటనే..ట్రైలర్ రిలీజ్ ప్రకటిస్తానని ఇటీవల తన ట్విట్టర్ లో ట్వీట్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టే చేశాడు. ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22వ తేదీన రిలీజ్ కానున్నట్టు.. విద్యాబాలన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె అధికారికంగా మహానాయకుడు రిలీజ్ డేట్ ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ అలా ప్రకటించారో లేదో.. వర్మ కూడా తాను తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ డేట్ ను ఫిక్స్ చేసేశాడు. ఫిబ్రవరి 14వ తేదీన లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ అవుతుందని. తమ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. ఫిబ్రవరి 14న ఉదయం 9.27 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ అవుతుందని చెప్పాడు. అంతేకాదు మరో ట్విస్ట్ కూడా ఇచ్చాడు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఫిబ్రవరి 22వ తేదీన మహానాయకుడు సినిమాతో పాటు రిలీజ్ అవుతుందని.. మహానాయకుడు సినిమా చూడటానికి వచ్చే వాళ్లు థియేట్రికల్ ట్రైలర్ కూడా చూడొచ్చని తెలిపాడు. మొత్తానికి వర్మ అన్న మాట మీద నిలబడ్డాడు.

 


కాగా ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. సినిమాను మార్చిలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు వర్మ. అయితే ఈ లోపు తను ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన ఫొటోలు తమ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు. ఇక ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తుండగా.. కీలకమైన చంద్రబాబు నాయుడు పాత్రలో వంగవీటి ఫేం శ్రీతేజ్‌ కనిపించనున్నాడు. ఇక ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ నటిస్తున్నాడు. మరి వర్మ ముందు ముందు ఇంకెన్ని ట్విస్ట్ లు ఇస్తాడో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=l09mrSOU37o]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + eleven =