దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా మహి.వి రాఘవ్ దర్శకత్వంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. నిన్న విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ్ ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నా దృష్టిలో ఒక వ్యక్తికి ఇచ్చే అత్యుత్తమ గౌరవం కృతజ్ఞత చూపించటమే. నా మీద ఇంత ప్రేమ చూపిస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులు, వైఎస్‌ఆర్ అభిమానులకు నా నమస్కారాలు. ఇంత గొప్ప కథ చెప్పే అవకాశం కలిగించిన సినిమా రంగానికి నా ధన్యవాదాలు. విమర్శలను కూడా నేను గౌరవిస్తాను.. నేను నమ్మి చేసిన కథ విషయంలో ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదని భావిస్తున్నా. ‘యాత్ర’ లాంటి సినిమా చేయటం ఎప్పటికీ గౌరవంగానే భావిస్తా. వైఎస్‌ఆర్ కథ చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావించాను. అందుకే ఈ సినిమా చేశా. ఇది వైఎస్‌ఆర్‌గారికి నేనిచ్చిన నివాళి అని తన లేఖలో తెలిపారు.
Thank You @YatraFilm @MahiVraghav @ShivaMeka @mammukka @VijayChilla @devireddyshashi pic.twitter.com/zeBTYHGDQ5
— Mahi Vraghav (@MahiVraghav) February 9, 2019
[youtube_video videoid=PBlWNr0Bm4g]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: