`పెళ్ళి చూపులు`, `అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం` వంటి విజయవంతమైన చిత్రాలతో యువతరానికి చేరువైన కథానాయకుడు విజయ్ దేవరకొండ. అనతి కాలంలోనే యూత్ ఐకాన్ గా పేరు తెచ్చుకున్న ఈ హ్యాండ్సమ్ హీరో… ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో `డియర్ కామ్రేడ్` చేస్తున్న విజయ్… మరోవైపు `మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు` ఫేమ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లోనూ ఓ సినిమా చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
`డియర్ కామ్రేడ్` రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా… క్రాంతి మాధవ్ సినిమాలో మల్టిపుల్ హీరోయిన్స్ నటిస్తున్నారని టాలీవుడ్ టాక్. ఆ మధ్య ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం… ముగ్గురు కాదు నలుగురు భామలకు ఈ సినిమాలో స్థానముందని తెలిసింది. రాశి ఖన్నా, కేథరిన్ ట్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి దే… ఇలా నలుగురు హీరోయిన్లు విజయ్‌తో జోడీ కడుతున్నారని సమాచారం. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
గోపీసుందర్ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా తెరపైకి రానుంది.
[youtube_video videoid=1ZLTAIfJzvc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: