తమిళంలో ఘనవిజయం సాధించిన `జింగర్తండా` సినిమాని… తెలుగులో `వాల్మీకి` పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం… ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్పైలో జరుగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించి కథానాయిక పాత్ర కోసం పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాగా… తెలుగమ్మాయి ఈషా రెబ్బా పేరు ఈ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోంది. అభినయానికి అవకాశమున్న ఈ పాత్రలో తెలుగమ్మాయి ఈష అయితే బాగుంటుందని యూనిట్ భావిస్తోందట. త్వరలోనే ఈష ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
[youtube_video videoid=t-SWlHFaFUk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: