మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం `సైరా నరసింహారెడ్డి`. తొలి తెలుగు స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ డ్రామాని దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో చిరు తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం… ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోందని సమాచారం. జాతర నేపథ్యంలో సాగే ఓ పాటను చిరు, తమన్నాతో పాటు దాదాపు 1000 మంది డ్యాన్సర్లు పాల్గొనగా భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. దాదాపు 12 రోజుల పాటు ఈ పాట తాలూకు చిత్రీకరణను యూనిట్ ప్లాన్ చేసిందని… మరో రెండు రోజుల్లో ఈ గీతానికి సంబంధించిన పిక్చరైజేషన్ కంప్లీట్ అవుతుందని టాక్. పాట పూర్తయ్యాక మరో రెండు రోజులు గ్యాప్ తీసుకుని… ఆ తరువాత తదుపరి షెడ్యూల్‌ని ప్లాన్ చేసిందట యూనిట్.
జాతీయ అవార్డు గ్రహీత అమిత్ త్రివేది స్వరసారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి `పద్మశ్రీ` సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యమందిస్తున్నారు.
[youtube_video videoid=1w5SRCH0hA4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: