సాహో సినిమాలో ప్రభాస్ కో స్టార్ ఎవ్లీన్ శర్మ మరో బంపరాఫర్ కొట్టేసింది. ఓ ఇంటర్నేషనల్ హోస్ట్ గా ఎవ్లీన్ శర్మ ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తాను కూడా తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇండో-జర్మన్ యాక్ట్రస్ అయిన ఎవ్లీన్ శర్మ యూరప్ లో చాలా పాపులర్ షో అయిన యూరో మాక్స్ అనే షో హోస్ట్ గా సైన్ చేసిందట. ఎవ్లీన్ శర్మకు ఉన్న పాపులారిటీ..జర్మన్ రూట్స్ కూడా ఉండటంతో షో మేకర్స్ ఆమెను సెలెక్ట్ చేశారట. ఇక ఈ అవకాశం రావడం తనకు ఎంతో థ్రిల్లింగ్ గా ఉందని…తన మథర్ జర్మనీలో ఉంటుంది కాబట్టి ఆమెతో కాస్త టైం గడిపే ఛాన్స్ ఉంటుందని ఎవ్లీన్ శర్మ చెప్పుకొస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడం.. అందులోనూ ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో నిర్మితమవుతుండటం.. అంతేకాకుండా పలు ఇండస్ట్రీలోని మహామహులంతా ఈసినిమాలో ఉండటంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. తమిళ నటుడు అరుణ్ విజయ్, మలయాళ నటుడు లాల్, ఇక బాలీవుడ్ నుండి హీరోయిన్ గా శ్రద్దా కపూర్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరాబేడి, ఎవ్లీన్ శర్మ తదితరులు సాహో కోసం టాలీవుడ్‌కు దిగుమతి అయ్యారు.
కాగా సుజిత్ దర్శకత్వంలో పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానున్నది. మరి చూద్దాం ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది.
[youtube_video videoid=3gQXWLW3xV4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: