దాదాపు పుష్కరకాలంగా కథానాయికగా రాణిస్తోంది అందాల తార కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిగా తనదైన శైలితో ముందుకు సాగుతున్న ఈ ముద్దుగుమ్మ… ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే… మరో వైపు అభినయానికి ప్రాధాన్యమున్న చిత్రాల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం కాజల్… `భారతీయుడు` సీక్వెల్‌తో పాటు `పారిస్ పారిస్` (తమిళ్), `సీత` చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా ఏస్ ఫిల్మ్ మేకర్ శంకర్ రూపొందిస్తున్న `భారతీయుడు` సీక్వెల్ ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళగా… `పారిస్ పారిస్`, `సీత` చిత్రీకరణ తుది దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం… `పారిస్ పారిస్`, `సీత` చిత్రాలు మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముందని తెలిసింది. వాస్తవానికి హిందీ చిత్రం `క్వీన్`కి రీమేక్‌గా తెరకెక్కుతున్న `పారిస్ పారిస్` ఫిబ్రవరిలోనే విడుదల కావాల్సి ఉండగా… కొన్ని కారణాల వల్ల మార్చికి వాయిదా పడిందని టాక్. ఇక తేజ దర్శకత్వంలో రూపొందుతున్న `సీత` మార్చి నెలాఖరులో రిలీజ్ కానుందని సమాచారం. `పారిస్ పారిస్`, `సీత` రెండు చిత్రాలు కూడా కాజల్ పాత్ర చుట్టూ తిరిగే సినిమాలే కావడంతో… ఈ చిత్రాల ఫలితాలు ఈ టాలీవుడ్ చందమామ కెరీర్‌కు కీలకంగా మారాయి.
[youtube_video videoid=S6RZi_F4zRw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: