జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలయిన రామ్ చరణ్ “వినయ విధేయ రామ” కు ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే విపరీతమైన డివైడ్ టాక్ వచ్చింది. ఆ డివైడ్ టాక్ పట్ల ఎలాంటి డివైడ్ ఒపీనియన్ కు ఆస్కారం లేదు. యునానిమస్ గా సినిమా బాగాలేదు అని మీడియా, ట్రేడ్, పబ్లిక్ చివరకు మెగా కాంపౌండ్ అభిమానులు కూడా అభిప్రాయపడ్డారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంతవరకు నిజం.
అయితే ఇంత ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమా కలెక్షన్స్ అంత బ్యాడ్ గా ఉండాలి కదా! కానీ ఆశ్చర్యకరంగా ఈ సినిమా తొలి 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా దాదాపు 59 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్లాప్ టాక్ సొంతం చేసుకున్న ఒక సినిమా ఇంత స్థాయిలో షేర్స్ రాబట్టటాన్ని హీరో స్టామినాగా చెప్పుకోవాలి. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఫ్లాప్ సినిమా కలెక్షన్స్ ఇతర హీరోల హిట్ సినిమాల కలెక్షన్స్ కు సమంగా ఉండేవి అన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఫ్లాప్ సినిమాగా ముద్ర పడిన రామ్ చరణ్ ” వినయ విధేయ రామ” కలెక్షన్స్ విషయంలో ఒకప్పటి చిరంజీవి ఫ్లాప్ సినిమాల స్థాయిలో హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేయడాన్ని బట్టి చరిత్ర పునరావృతం అవుతుంది అనుకోవచ్చు.
ఈ సినిమా తొలి ఎనిమిది రోజుల షేర్స్ ఈ విధంగా ఉన్నాయి.
నైజాం: 12.14
సీడెడ్: 11.29
నెల్లూరు: 2.76
గుంటూరు: 6.11
కృష్ణ: 3.48
వెస్ట్: 4.01
ఈస్ట్: 4.92
ఉత్తరాంధ్ర: 7.23
Total: 51.85
ఓవర్సీస్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని దాదాపు 59 కోట్ల షేర్ ను ఈ సినిమా రాబట్టింది. దీన్నిబట్టి ఫుల్ రన్ లో ఈ సినిమా దాదాపు 65 కోట్ల పైగా షేర్స్ రాబట్టే అవకాశం ఉంది.65 కోట్ల షేర్ అంటే ప్రేక్షకుడు ఈ సినిమాకు దాదాపు 90 కోట్ల పైగా ఇచ్చినట్లు. ప్రేక్షకుడు నుండి 90 కోట్లు రాబట్టిన సినిమాను ఫ్లాప్ అనుకునే పరిస్థితిలో మనం ఉన్నామంటే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ , కొనుగోలు విధానం, థియేటర్ రెంటల్స్ ఎంత పరిధులు దాటిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయో అర్థమవుతుంది.
అంటే ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ అనే మూడు ప్రక్రియల్లో కూడా అదుపాజ్ఞలు లేని అరాచక ధోరణులు ప్రబలి పోతున్నాయి అనటానికి ఈ “అపజయ విజయాన్ని” ఒక తాజా ఉదాహరణగా చెప్పుకోవాలి.
రామ్ చరణ్ లాంటి ఒక 11 సినిమాల యంగ్ స్టార్ కు ఇంత గొప్ప స్టామినా ఉన్నందుకు సంతోషించాలా? ఇంత వసూలు చేసినా ఈ సినిమా ట్రేడ్ కు నష్టాలు తెస్తున్నందుకు బాధపడాలా?
ఇదే సినిమా 60 కోట్ల నియంత్రిత బడ్జెట్లో రూపొంది ఉంటే అది ఎలాంటి ఆరోగ్యకర ఫలితాలను ఇచ్చి ఉండేది?
ఎందుకు మన నిర్మాణ ధోరణులు ఇలా హద్దులు దాటి నియంత్రణ తప్పి పోతున్నాయి.
ఇది కేవలం “వినయ విధేయ రామ” కు మాత్రమే వర్తించే ఆవేదన కాదు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ప్రతి సినిమా నిర్మాణం హద్దులు దాటుతుంది. విజయాలు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ లాగా పలకరిస్తుంటే ఫ్లాపులు నిత్యకృత్యాలు అయిపోయాయి. అలా ఒకటి అరగా వచ్చే విజయాలు కూడా హద్దులు దాటిన నిర్మాణ వ్యయంతో రిలీజ్ కు ముందే కాస్ట్ ఫెయిల్యూర్ అవుతున్నాయి.
మొత్తానికి ఇలాంటి పరిస్థితులలో మన సినిమాలను “విజయవంతమైన అపజయాలు” గా ” అపజయ విజయాలు”గా వర్గీకరించుకోవలసి వస్తుందే తప్ప “ఆరోగ్యకర విజయాలు”గా ఆనందపడే పరిస్థితులు కనిపించడంలేదు.
“Its a flop… but hit” and “its a hit.. but flop”- ఇదీ మన సినిమాల పరిస్థితి. ఈ పరిస్థితి పై చాలా లోతైన చర్చ జరగవలసిన అవసరం ఉంది. ఒకటి అరా సినిమాలు 100 కోట్లు, 150 కోట్ల క్లబ్బుల్లో చేరినందుకు సంబరాలు చేసుకోవడం కాదు… సాలీనా వేలకోట్ల నష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితులను విశ్లేషించుకోవలసిన అవసరం ఉంది.
[youtube_video videoid=DZ9GdjMHXFM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: