మెగా కాంపౌండ్ నుండి ఇప్పటికే పలువురు హీరోలు వెండి తెరపై సందడి చేస్తుండగా ఇప్పుడు మరో హీరో ఎంట్రీ ఇచ్చాడు. మెగా మేనల్లుడు సాయథరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ గత కొద్దికాలంగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఆ టైం రానే వచ్చింది. వైష్ణవ్ తేజ్ హీరోగా కొత్త సినిమా తెరకెక్కనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు దర్శకత్వంలో..వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిస్తున్న ఈ సినిమాను ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమాకు… చిరంజీవి క్లాప్ కొట్టగా.. తొలి షాట్ ను హీరో హీరోయిన్లపై చిత్రీకరించారు. చిరంజీవితో పాటు పలువురు మెగా హీరోలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
2009 I started my journey as an actor and the Telugu film industry has been really kind to me and taught me a lot… and in 2019 my little brother #PanjaVaisshnavTej is starting his journey into TFI…hope that he gets the same love,affection and blessings from you… 🙏🏼 pic.twitter.com/OjEaUsohHj
— Sai Dharam Tej (@IamSaiDharamTej) January 21, 2019
కాగా సుకుమార్ .. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు తెలియజేయనున్నారు.
[youtube_video videoid=QtGr3NQVyyk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: