ఇటీవల విశాల్ పెళ్లి ముచ్చట్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. విశాల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని.. హైదరాబాద్ కు చెందిన అనీషా అనే అమ్మాయితో పెళ్లి జరగనుందని..అంతేకాదు ఎంగేజ్ మెంట్ కూడా ఇక్కడే ఉంటుందని విశాల్ తండ్రి జికె రెడ్డి మీడియా ముఖంగా ఇటీవల చెప్పడంతో ఇంతకీ ఆ ఆమ్మాయి ఎవరబ్బా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఎప్పటిలాగే విశాల్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని ఓ అమ్మాయి ఫొటోని పోస్ట్ చేసేశారు కొందమంది నెటిజన్లు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ వార్తలపై స్పందించిన విశాల్ ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు.. నా పెళ్లి గురించిన వివరాలు నేనే స్వయంగా చెబుతాను అంటూ తన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టి..ఈ గాసిప్స్ కు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక ఇప్పుడు తాజాగా సంక్రాంతి వేళ ఈ సస్పెన్స్ కు అనీషా తెరదించింది. విశాల్ తో దిగిన ఫొటోను విడుదల చేసిన అనీషా, త్వరలోనే కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు అనీషా ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది.
అయితే విశాల్ చేసుకోబోయే అమ్మాయిని చూసి ఇప్పుడు అందరూ షాకవుతున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నారా?..ఎవరో కాదు పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాల్లో నటించిన అమ్మాయే అనీషా రెడ్డి. ఈ అమ్మాయినా విశాల్ పెళ్లి చేసుకోయేదని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. విశాల్, తన ఫొటోను పోస్ట్ చేస్తూ.. విశాల్ లాంటి వ్యక్తిని తన జీవితభాగస్వామిగా చేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొంది.హైదరాబాద్ బిజినెస్‌మేన్ విజయ్ రెడ్డి, పద్మజల కుమార్తె అనీషా రెడ్డి. పెళ్లి తరువాత ఆమె సినిమాల్లో నటించే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. మొత్తానికి విశాల్ పెళ్లిపై ఉన్న సస్పెన్స్ కు తెరపడింది.
https://www.instagram.com/p/Bsp5-KGgNpd/?utm_source=ig_web_button_share_sheet
[youtube_video videoid=ISSJx9e4em0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: