ప్రస్తుతం ఎక్కడ చూసినా బయోపిక్ ల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ్ ఇలా ఒక్క భాష అని కాదు అన్ని భాషల్లోనూ పలువురి ప్రముఖుల జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో కొన్ని రిలీజ్ అయ్యాయి..కొన్ని రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. ఇకపోతే తాజాగా తెరకెక్కుతున్న కొన్ని సినిమాలు యాదృశ్చికంగా ఒకే బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్నాయి.. అదేంటంటే..క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
న్యాచురల్ స్టార్ నాని గౌరి తిన్నూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. అర్జున్ అనే పాత్రలో నాని నటిస్తున్నాడు.
రంజీ ట్రోఫీ నేపథ్యంలో ఓ క్రికెటర్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే అర్ధమైపోయింది. ఇక ఇటీవల విడుదల చేసిన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
క్రికెట్ నేపథ్యంలో వస్తున్న మరో సినిమా డియర్ కామ్రేడ్. విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. గత కొద్దిరోజులుగా కాకినాడలో లాంగ్ షెడ్యూల్ లో షూటింగ్ జరుపుకోగా ఇటీవలే ఆ షెడ్యూల్ ముగిసింది. ఇక ఈ సినిమాలో పవర్‌ఫుల్ మెడికల్ స్టూడెంట్ పాత్రలో విజయ్ కనిపించనుండగా.. స్టూడెంట్ కమ్ క్రికెటర్ పాత్రలో రష్మిక కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం రష్మిక ప్రత్యేకంగా ప్రాక్టీస్ కూడా చేసినట్టు తెలుస్తోంది.
ఇక ఇదే క్రికెట్ బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కుతున్న సినిమా మజిలీ. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత, దివ్యాంక కౌశిక్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కూడా క్రికెట్ నేపథ్యం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన సెకండ్ లుక్ ను చూస్తుంటే ఆ విషయం ఈజీగా అర్ధమైపోతుంది. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా క్రికెటర్ గా కనిపించనున్నాడు.
మొత్తానికి అనుకోకుండా ఈ మూడు సినిమాలు క్రికెట్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కడం ఆశ్చర్యకరమైన విషయమే. ఇందులో జెర్సీ మూవీ అవుడ్ అండ్ అవుడ్ క్రికెట్ బ్యాక్ డ్రాప్ ఉండగా… మిగిలిన రెండు సినిమాల్లో కొంత భాగమే ఉండేలా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా వరల్డ్ కప్, ఐపీల్ సీజన్ లాంటి క్రికెట్ ఫీవర్ లో ఈ మూడు సినిమాలు కూడా అదే రావడం వల్ల క్రికెట్ అభిమానులకు డభల్ ధమాకానే అని చెప్పొచ్చు.
[youtube_video videoid=Rl6T0bM94Qs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: