`ఆషిఖీ 2` చిత్రంతో యావత్ భారతీయ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. ఆ తరువాత `ఏక్ విలన్`, `ఏబీసీడీ 2`, `బాఘీ`, `స్త్రీ` తదితర చిత్రాలతో హిందీనాట నటిగా తనదైన ముద్ర వేసింది. ఇదిలా ఉంటే… యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం `సాహో`లో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధ… పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవలే తన షూటింగ్ పార్ట్‌ను పూర్తిచేసిన ఈ ముద్దుగుమ్మ… హోమ్ టౌన్ ముంబయికి వెళ్ళిపోయింది. అయినప్పటికీ… యూనిట్‌తో మాత్రం టచ్‌లో ఉంటూనే ఉందట శ్రద్ధ. అంతేకాదు… మకర సంక్రాంతిని పురస్కరించుకుని తమ ఇంట్లో తయారు చేసిన మహారాష్ట్ర సంప్రదాయ వంటకం `తిల్ గుల్ లడ్డులు` బాక్స్‌లను ప్రభాస్‌తో సహా యూనిట్ మొత్తానికి పంపి… మరోమారు ఇంప్రెస్ చేసిందట శ్రద్ధ. ఇంతకుముందు… ప్రభాస్ కూడా శ్రద్ధకు హైదరాబాద్ షూటింగ్ టైమ్‌లో తమ ఇంటి వంటకాల రుచులను చూపించాడని… ఇప్పుడు శ్రద్ధ కూడా అదే బాటలో వెళ్ళి తమ ఇంటి `హోమ్ ఫుడ్`టేస్ట్ ను పరిచయం చేసిందని యూనిట్ టాక్. మొత్తానికి… `సాహో` యూనిట్‌కి శ్రద్ధ ప్రియమైన కథానాయిక అయిపోందన్నమాట. కాగా.. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `సాహో` ఆగస్టు 15న తెరపైకి రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: