బ్రదర్ సెంటిమెంట్ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించాయి. వాటిలో ముందు వరుసలో ఉండే చిత్రం ‘అన్నయ్య’. ‘హిట్లర్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి నటించిన సినిమా ఇది. చిరు సరసన సౌందర్య హీరోయిన్‌గా నటించగా… ఇతర పాత్రల్లో రవితేజ, వెంకట్, చాందిని, శిప్వా, కోట శ్రీనివాసరావు, శరత్‌బాబు, భూపేందర్ సింగ్ నటించారు. సిమ్రన్ స్పెషల్ సాంగ్‌లో మెరిసిన ఈ చిత్రాన్ని శ్రీ సాయిరాం ఆర్ట్స్ పతాకంపై కె.వెంకటేశ్వరరావు నిర్మించారు. ‘మెలోడి బ్రహ్మ’ మణిశర్మ స్వరాలను సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ‘సయ్యారే సయ్య’, ‘గుస గుసలే’, ‘వాన వల్లప్ప’, ‘బావ చందమామలు’, ‘ఆట కావాలా పాట కావాలా’, ‘హిమ సీమల్లో’… ఇలా ప్రతీ పాట మెగాభిమానులను అలరించింది. జనవరి 7, 2000న విడుదలైన `అన్నయ్య`… నేటితో 19 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=dSIVXJT1Vfo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: