తేజ డేరింగ్ డెసిషన్ – ఆర్టికల్ 370పై సినిమా..!

Director Teja Takes A Daring Decision,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Director Teja Upcoming Project Details,Director Teja New Movie,Director Teja Next Movie on Article 370

మొదటి నుండి కాస్త డిఫరెంట్ స్టోరీలను తెరకెక్కిస్తుంటాడు డైరక్టర్ తేజ. తాను డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమా ‘చిత్రం’ ఆ తర్వాత వరుసగా ‘నువ్వు నేను’, ‘జయం’ ఇలా సూపర్ హిట్లు కొట్టాడు. ఒక్క ‘నువ్వు నేను’ సినిమాకే ఆరు నంది అవార్డులు వచ్చాయంటేనే అర్ధం చేసుకోవచ్చు. ఇక ఫుల్ ఫామ్ లో వున్న తేజ ఆ తరవాత తీసిన సినిమాల వల్ల కాస్త వెనుకపడ్డాడు. అయితే చాలా కాలం తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా హిట్ తో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ‘సీత’ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి.

అయితే టాలీవుడ్ లో ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. తేజ ఓ డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడట. ఇంతకీ ఆ డెసిషన్ ఏంటంటే..? ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్టికల్ 370 ఇష్యూ. ఈ ఇష్యూ పై తేజ సినిమా తీయాలని చూస్తున్నాడట. అంతే కాదు తెలుగు హిందీ రెండు భాషల్లో ఈ సినిమా తీసే ప్లాన్ లో వున్నాడట. ప్రస్తుతం ఈ ఇష్యూ పై ఫుల్ రీసెర్చ్ లో వున్నాడట తేజ. మరి ఈ సినిమాలో ఏ హీరో నటిస్తాడో చూద్దాం.

ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్ రెండుగా విడిపోయింది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ-కశ్మీర్ ఏర్పడగా, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడింది.

కాగా ఇప్ప‌టికే ఆర్టిక‌ల్ 15 నేప‌థ్యంతో సినిమా తెర‌కెక్క‌గా, ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆయుష్మాన్ ఖురానా ఇందులో ప్ర‌ధాన పాత్ర పోషించారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here