క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండాగా ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే.. ఈ సినిమా వచ్చే ఏడాది లవర్స్ డే అదే వాలెంటైన్స్ డే రోజున రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా ఈ సినిమాలో విజయ్ కి జోడిగా రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ థెరిస్సా, ఇజబెల్లె నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ నాలుగు షేడ్స్ లో కనిపించనున్నాడట.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: