ట్రెండ్ సెట్టింగ్ మూవీ ‘శివ’కు 30 ఏళ్ళు

30 Years For Trend Setting Siva Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,30 Years Completed For Siva Telugu Movie, 30 Years For Nagarjuna Siva Movie,Siva movie Completes 30 Years, Siva Telugu Movie Completes 23 Years

తెల‌గు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎంతో మంది ద‌ర్శ‌కులు వ‌స్తుంటారు, పోతుంటారు. అయితే, కొంద‌రు మాత్ర‌మే స‌రికొత్త‌ ట్రెండ్‌ని సెట్ చేస్తుంటారు. అలాంటి అరుదైన ద‌ర్శ‌కుల్లో `ఎవ‌ర్‌గ్రీన్ సెన్సేష‌న్` రామ్‌గోపాల్ వర్మ ఒకరు. ద‌ర్శ‌కుడిగా వేసిన తొలి అడుగుతోనే ప్ర‌భంజ‌నం సృష్టించిన వైనం త‌న సొంతం. అలా… ఓ ట్రెండ్ సెట్టింగ్ డైరెక్ట‌ర్‌కి బీజం వేసిన ఆ ట్రెండ్ సెట్టింగ్ మూవీనే… ‘శివ’. ఈ సినిమాకు సంబంధించి స్టోరీ, స్క్రీన్‌ప్లే, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ప్రచార చిత్రాలు, పోస్టర్లు… ఇలా ప్ర‌తీదీ చాలా డిఫ‌రెంట్‌గా డిజైన్ చేసి భావిత‌రం ద‌ర్శ‌కుల‌కు స్ఫూర్తిప్ర‌దాత‌గా నిలిచారు `వ‌న్ అండ్ ఓన్లీ` వ‌ర్మ‌. అలాగే తొలి చిత్రంతోనే `ఉత్త‌మ ద‌ర్శ‌కుడు`, `ఉత్త‌మ నూత‌న ద‌ర్శ‌కుడు`… ఇలా రెండు విభాగాల్లోనూ `నంది` పుర‌స్కారాలు అందుకుని ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌ను విస్మ‌య‌ప‌రిచారు వ‌ర్మ‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అప్ప‌టివ‌ర‌కు స‌గ‌టు చిత్రాల‌కు, పాత్ర‌ల‌కు ప‌రిమిత‌మైన కింగ్‌ నాగార్జునని, ఆయ‌న‌లోని హీరోయిజాన్ని మ‌రో స్థాయికి తీసుకెళ్ళిన ఘ‌న‌త కూడా `శివ‌`కు, వ‌ర్మ‌కు ద‌క్కుతుంది. నాగ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోవ‌డ‌మే కాకుండా… `శివ`కి ముందు, త‌రువాత అన్నంత‌గా త‌న‌ కెరీర్‌పై ప్ర‌భావం చూపించింది `శివ‌` చిత్రం. ఇందులో నాగార్జునకి జోడిగా అమల నటించగా… రఘువరన్, మురళీమోహన్, కోట శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతీరావు, సాయిచంద్, తనికెళ్ళ భరణి, ‘శుభలేఖ’ సుధాకర్, భవాని, ఉత్తేజ్, జె.డి.చక్రవర్తి, చిన్నా, నిర్మలమ్మ తదితరులు ముఖ్య భూమిక‌లు పోషించారు.

వేటూరి సుందరరామమూర్తి, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గీత రచన చేయగా… మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. “బోటనీ పాఠముంది”, “సరసాలు చాలు శ్రీవారు”, “ఆనందో బ్రహ్మ”, “ఎన్నియల్లో”, “కిస్ మీ హలో రాంగ్ నంబర్”… ఇలా ఇందులోని ప్రతీ పాట విశేషాదరణ పొందింది. పలు `నంది` పురస్కారాలతో పాటు… `ఫిల్మ్ ఫేర్` అవార్డును కూడా కైవ‌సం చేసుకున్న ఈ చిత్రాన్ని… అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర సంయుక్తంగా నిర్మించారు. ఇదే సినిమాని హిందీలో ‘షివ’గా పునర్నిర్మించి… అక్కడ కూడా దర్శకుడిగా తొలి అడుగులోనే సంచ‌ల‌నం సృష్టించారు వర్మ. 1989 అక్టోబర్ 5న విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ‘శివ’… నేటితో 30 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + seven =