కాజ‌ల్ ఖాతాలో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్‌

2019 Latest Telugu Film News, Another Blockbuster Movie For Kajal Aggarwal, Kajal Aggarwal Bags Another Bolck buster, Kajal Aggarwal Latest Movie News, Komali Blockbuster Movie For Kajal Aggarwal, Kajal Aggarwal Upcoming movie Projects, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News

తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్‌ని మూట‌గ‌ట్టుకున్న‌ టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌… తాజాగా మ‌రో ఘ‌న‌విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. పంద్రాగ‌స్టున విడుద‌లైన ఆ చిత్రమే `కోమాలి`. `జ‌యం` ర‌వి క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ త‌మిళ సినిమాలో కాజ‌ల్ గ్లామ‌ర్ రోల్‌లో సంద‌డి చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టీనేజ్‌లో కోమాలోకి వెళ్ళిన క‌థానాయ‌కుడు… 16 ఏళ్ళ త‌రువాత కోమా నుంచి బ‌య‌ట‌ప‌డ‌తాడు. ఈ నేప‌థ్యంలో… ఈ ప‌ద‌హారేళ్ళ‌లో చోటుచేసుకున్న మార్పుల‌కు అల‌వాటు ప‌డ‌లేక అత‌ను ఎలాంటి ఇబ్బందుల‌కు గుర‌య్యాడు? అనే క‌థాంశంతో ఈ కామెడీ ఫిల్మ్ తెర‌కెక్కింది. ఆద్యంతం వినోదభ‌రితంగా రూపొందిన ఈ సినిమాకి త‌మిళ‌నాట విశేషాద‌ర‌ణ ద‌క్కుతోంది. అంతేకాదు… ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అలాగే తెలుగులోనూ కాజ‌ల్ నాయిక‌గా న‌టించే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే… ప్ర‌స్తుతం కాజ‌ల్ భారీ బ‌డ్జెట్ త‌మిళ చిత్రం `ఇండియ‌న్ 2`లో నాయిక‌గా న‌టిస్తోంది. అలాగే ఆమె న‌టించిన ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ `పారిస్ పారిస్‌` విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =