వారం రోజుల గ్యాప్‌లో రానున్న‌ కోలీవుడ్ బ్ర‌ద‌ర్స్‌

2019 Latest Telugu Film News, Kollywood Brothers To Release Their Movies With 1 Week Gap, Kollywood Brothers, Kollywood Brothers Latest Movie News, Surya And Karthi Movies To Release With 1 weak gap, Kollywood Brothers Surya And Karthi, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News

త‌మిళంతో పాటు తెలుగులోనూ త‌మ‌కంటూ ప్ర‌త్యేక మార్కెట్ సంపాదించుకున్నారు కోలీవుడ్ బ్ర‌ద‌ర్స్ సూర్య‌, కార్తి. ఇదిలా ఉంటే… ఈ అన్న‌ద‌మ్ములిద్ద‌రూ వారం రోజుల గ్యాప్‌లో త‌మ కొత్త చిత్రాల‌తో ప‌ల‌క‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. అంతేకాదు… ఈ రెండు త‌మిళ సినిమాలు తెలుగులోనూ అనువాద రూపంలో విడుదల కానుండడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాస్త‌ వివరాల్లోకి వెళితే… సూర్య క‌థానాయ‌కుడిగా కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ తమిళ చిత్రం ‘కాప్పాన్’. తెలుగులో ‘బందోబస్త్’ పేరుతో విడుదల కానున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, ఆర్య, సయ్యేషా కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌… సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా… ఈ సినిమా విడుద‌లైన వారం రోజుల త‌రువాత అంటే సెప్టెంబర్ 27న కార్తి ప్ర‌ధాన పాత్ర‌లో లోకేష్ కనకరాజ్ రూపొందించిన‌ ‘ఖైదీ’ విడుదల కానున్న‌ట్టు స‌మాచారం. తెలుగులోనూ ఇదే పేరుతో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ రిలీజ్ కానుంది.

మ‌రి… వారం గ్యాప్‌లో వ‌స్తున్న ఈ కోలీవుడ్ బ్ర‌ద‌ర్స్ ఆ యా చిత్రాల‌తో ఘ‌న‌విజ‌యాల‌ను అందుకుంటారేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =