మల్లేశం తెలుగు మూవీ రివ్యూ – మనసును హత్తుకునే కథ

Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Mallesham Movie Public Talk, Mallesham Movie Review, Mallesham Movie Review And Ratings, Mallesham Movie Story, Mallesham Review, Mallesham Telugu Movie Live Updates, Mallesham Telugu Movie Public Response, Mallesham Telugu Movie Review, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Mallesham Telugu Movie Review

ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తుంది ఏ ఇండస్ట్రీలో చూసినా. ఇప్పటికే పలు బయోపిక్ లు తెరకెక్కించగా… ఇప్పుడు పద్మశ్రీ చింతకింద మల్లేశం బయోపిక్ ను కూడా తెరెకక్కించారు.పెళ్లి చూపులు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి ప్రధాన పాత్రలో మల్లేశం సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ ఆర్.రాజ్. ఈ సినిమా టీజర్ కు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. మరి ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

న‌టీన‌టులు: ప్రియ‌ద‌ర్శి, అన‌న్య‌, ఝాన్సీ, చ‌క్ర‌పాణి, తాగుబోతు ర‌మేశ్ త‌దిత‌రులు
బ్యానర్ : సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌, స్టూడియో 99
ద‌ర్శ‌క‌త్వం: రాజ్‌.ఆర్‌
సినిమాటోగ్ర‌ఫీ: బాలు శాండిల్య‌స‌
సంగీతం : మార్క్ కె.రాబిన్‌
నిర్మాత‌లు: రాజ్‌.ఆర్‌, శ్రీఅధికారి

కథ :

చింతకింద మల్లేశం(ప్రియదర్శి) కుటుంబం చేనేత వృత్తి చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఆ ఊరిలో ఉన్నవారందరికీ అదే జీవనాధారం. వేరే వృత్తి చేసుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే మల్లేశం తల్లిదండ్రులు (చక్రపాణి, ఝాన్సీ) కూడా ఎన్నో సమస్యల మధ్యనే చేనేత పని చేస్తూ బ్రతుకుతుంటారు. సరైన సంపాదన లేకపోవడంతో ఓ పక్క అప్పులు కూడా ఎక్కువవుతాయి. దీంతో మల్లేశంను 6వ తరగతిలోనే చదువు మాన్పించి, చేనేత పని నేర్పిస్తాడు తండ్రి. అలా చదువును చిన్నతనంలోనే ఆపేసిన మల్లేశం తన తల్లిదండ్రులకు సాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో చేనేత పనిలో భాగంగా ఆసును అమర్చాల్సి ఉంటుంది. అది చాలా కష్టమైన పని కావడంతో.. మల్లేశం తల్లి ఆసు పని చేస్తూ ఇబ్బంది పడుతుంటుంది. అంతేకాదు ఆ పని చేయడం వల్ల ఆమెకు భుజం నొప్పి వస్తుంది. వైద్యులు ఆ పని చేయకూడదని.. చేస్తే ప్రాబ్లమ్ అవుతుందని చెప్పినా కూడా ఓపిక చేసుకొని పని చేస్తూనే ఉంటుంది. అయితే తన తల్లి బాధ చూడలేని మల్లేశం ఎలాగైనా దానికి ఓ పరిష్కారం చూడాలని.. అందులో భాగంగానే ఆసు యంత్రాన్ని తయారు చేయాలనుకుంటాడు. అలా ఎప్పుడు చూసినా యంత్రాన్ని తయారు చేసే ధ్యాసలోనే ఉండటంతో మల్లేశంకు పెళ్ళి చేసేయమని అతని తల్లిదండ్రులకు సలహా ఇస్తారు అందరూ. ఇక ఆ యంత్రాన్ని చేసే క్రమంలో ఎన్నో అప్పులు చేస్తాడు.. స్నేహితులు, ఊరిలో వాళ్లు, బంధువుల నుండి అవమానాలు ఎదురవుతాయి..దాంతో తన భార్యతో కలిసి పట్నం దారి పడతాడు. అతనికి పట్నంలో ఎదురైన పరిస్థితులేంటి ? మరి మల్లేశం ఆసు యంత్రాన్ని ఎలా కనుగొన్నాడు ? అనే విషయం తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

విశ్లేషణ:

నిజానికి ఈ సినిమాకు మొదటి నుండి పాజిటివ్ వైబ్రేషన్సే వచ్చాయి. ఈ సినిమాకు మూడు పాత్రలు హైలెట్ అని చెప్పొచ్చు. పెళ్లి చూపులు సినిమాలో తన తెలంగాణ డైలాగ్స్ తో అందరినీ నవ్వించిన ప్రియదర్శి ఈసినిమాలో కూడా మల్లేశం పాత్రలో ఒదిగిపోయాడు. తెలంగాణ యాస‌లో డైలాగ్స్ చెప్ప‌డం, ఎమోష‌న‌ల్ సీన్స్‌లో న‌టించ‌డం, ఆసు యంత్రాన్ని కనుగొన‌డంలో ప‌డే తాప‌త్ర‌యం లాంటి అన్ని భావాలతో ప్రియ‌ద‌ర్శి న‌ట‌న ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమాతో కేవలం కామెడీ మాత్రమే కాకుండా ఇలాంటి సినిమాల్లో కూడా తాను నటించగలనని ప్రూవ్ చేసుకున్నాడు.

ఇక మ‌ల్లేశం భార్య ప‌ద్మ పాత్ర‌లో నటించిన అన‌న్య. మల్లేశం భార్యగా చేసిన అనన్యకు ఈసినిమాతో మంచి మంచి ఆఫర్లే క్యూ కడతాయోమే అనిపిస్తుంది ఆమె నటన చూస్తుంటే. ఇదే మొదటి సినిమా అయినప్పటికీ చాలా చ‌క్క‌టి నటన కనబరిచింది. కొన్ని కొన్ని సన్నివేశాల్లో ప్రియదర్శినిని సైతం డామినేట్ చేసిందని చెప్పొచ్చు.

ఇక తల్లి పాత్రలో చేసిన ఝాన్నీ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక‌పై ఝాన్సీ ఖచ్చితంగా త‌ల్లి పాత్ర‌లతో బిజీ అవుతుందేమో. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర బాగానే నటించారు.

ఇక డైరెక్టర్ ఆర్.రాజ్ తీసుకున్న కథతోనే సగం సక్సెస్ అవ్వగా… ఎవరో పెద్ద పెద్ద నటీనటులు కాకుండా.. ఇప్పుడిప్పుడే సక్సెస్ అందుకుంటున్న ప్రియదర్శిని.. అలాగే మిగిలిన పాత్రలను ఎంచుకోవడంతో ఆ సగం కూడా సక్సెస్ అయ్యాడు. తన మొదటి ప్రయత్నం లోనే మల్లేశం బయోపిక్ ని ఎంచుకొని దాన్ని సరైన దిశలో నడిపించి మంచి మార్కులు కొట్టేసాడు. ఎలాంటి కమర్షియల్ హంగులకు పోకుండా.. తెలంగాణ వాతావరణాన్ని చూపిస్తూ.. సినిమాలో ఓ వైపు ఓ వ్య‌క్తి ప్ర‌యాణాన్ని వివ‌రిస్తూనే, చేనేత కార్మికులు ప‌డే క‌ష్ట‌న‌ష్టాల‌ను హృదయానికి హత్తుకునేలా తెర‌కెక్కించాడు. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్సే ఉండక్కర్లేదని.. కంటెంట్ ఉండి ప్రేక్షకుడిని కూర్చోబెడితే చాలు సినిమాను చూస్తారని మరోసారి నిరూపించాడు.

ఇక మార్క్ కె.రాబిన్‌ అందించిన సంగీతం.. కౌండిల్యస కెమెరా ప‌నితం చాలా బావుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
కథ
ప్రియదర్శి, అనన్య, ఝాన్సీ నటన

మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ స్లోగా సాగే కొన్ని సన్నివేశాలు

ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా పలానా వర్గం మాత్రమే చూడాల్సిన సినిమా అని చెప్పే సినిమా కాదు. ఓ సామాన్య వ్యక్తి తన జీవితంలో సాధించిన విజయం.. పడే కష్టం గురించి.. అలాగే చేనేత కార్మికలు కష్టం ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

మల్లేశం తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • ScreenPlay
  • Direction
  • Performance
3
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here