అన్ని సినీ పరిశ్రమల్లో ఏమో కానీ.. మన తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం శుక్రవారం వస్తుందంటే చాలు.. కొత్త సినిమాల సందడి మొదలవుతుంది బాక్సాఫీస్ వద్ద. శుక్రవారం వస్తే చాలు ఆడియన్స్ కూడా ఏ సినిమా రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక దర్శక నిర్మాతలు కూడా శుక్రవారమే తమ సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. పోటీకి వేరే సినిమాలు ఉన్నా కూడా సినిమా బావుంటే ప్రేక్షకులే ఆదరిస్తారన్న నమ్మకంతో.. అదే రోజు రిలీజ్ చేస్తారు. ఇక ప్రేక్షకులు కూడా సినిమాలో కంటెంట్ ఉంటే అది చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అని చూడరు. సినిమా నచ్చితే హిట్ చేస్తారు.. నచ్చకపోతే ఫట్ చేస్తారు. ఏదైనా సినిమావాళ్ల పల్స్ మాత్రం ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. ఇక ఎప్పటిలాగే ఈ శుక్రవారం కూడా పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయ్యాయి. వాటిలో మంచు విష్ణు సినిమా మినహా పెద్ద హీరోల సినిమాలు ఏమీ లేకపోయినా.. అంచనాలు మాత్రం బాగానే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కన్నడలో సూపర్ హిట్ అయిన ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈసినిమా టీజర్ కు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా కూాడా హిట్ అవుతుందనే నమ్మకంతోనే ఉన్నారు. అజయ్ కీలక పాత్రలో నటించిన సినిమా ‘స్పెషల్’ కూడా అదే రోజు రిలీజ్ అవ్వనుంది. ఓ కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక అసు యంత్రాన్ని కనిపెట్టిన పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో ‘మల్లేశం’ అనే సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక మంచి విష్ణు నటించిన ‘ఓటర్’ సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. నిజానికి ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈసినిమా జూన్ 21 కి డేట్ ఫిక్స్ చేసుకుంది. లేట్ అయినా కూడా ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా నటించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా కు జూన్ 21న రిలీజ్ కానుంది.
అలాగే ఈ సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందనుకుంటున్నారో మీ ఓటు ద్వాారా గెస్ చేయండి
[youtube_video videoid=Aoe_oWBUJ3o]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: