నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి ‘క్రాంతి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. ఈ చిత్రంలో బాలకృష్ణ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడట. అంతేకాదు… ఈ సినిమాలో బాలయ్య స్క్రీన్ నేమ్ కూడా క్రాంతి అని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి ‘క్రాంతి’ టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. కొన్నాళ్ళ క్రితం ఈ సినిమాకి ‘రూలర్’ అనే టైటిల్ ప్రముఖంగా వినిపించింది. అయితే… ఇప్పుడు ‘క్రాంతి’ ఫైనల్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ టైటిల్‌కు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించనున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్… 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రచారం సాగుతోంది.
[subscribe]
[youtube_video videoid=jUxnrFUYzBA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: