ఆ మధ్య `రాజుగారి గది 2` అనే హారర్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన టాలెంటెడ్ బ్యూటీ సమంత… ఇప్పుడు మరో హారర్ మూవీలో నటించబోతోందట. అయితే, ఈ సారి టాలీవుడ్‌లో కాదు, కోలీవుడ్‌లో ఈ తరహా చిత్రం చేయనుందట సామ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… నయనతారతో ‘డోరా’(2017) అనే హారర్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు దాస్ రామస్వామి… ఇప్పుడు సామ్ కోసం మరో హారర్ స్టోరీని రెడీ చేసాడట. హారర్ నేపథ్యంతో పాటు ఫీమేల్ సెంట్రిక్ మూవీ కూడా కావడంతో సామ్ ఈ ప్రాజెక్ట్‌కి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ టాక్. కాగా… ఈ తమిళ చిత్రంపై త్వరలోనే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే… సామ్ నటించిన ఫీమేల్ సెంట్రిక్ ఫిలిమ్ ‘ఓ బేబీ’ జూలై 5న విడుదల కానుంది. కొరియన్ మూవీ `మిస్ గ్రానీ`కి రీమేక్ వెర్షన్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.
[subscribe]
[youtube_video videoid=eU2vwUoPOAQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: