అప్పుడు ‘నువ్వు నేను ప్రేమ’ ఇప్పుడు ‘హిప్పీ’

Director TN Krishna About Critics Response on Hippi,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Hippi Director New Movie Updates,Director T.N. Krishna Recalled his Debut Movie,Director T.N. Krishna Next Project Details,Hippi Director About Critics Response on Hippi
Director TN Krishna About Critics Response on Hippi

టీఎన్ కృష్ణ దర్శకత్వంలో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా తెరకెక్కిన సినిమా ‘హిప్పీ’. ఇటీవలే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే యూత్ కి మాత్రం ఈ సినిమా బాగానే నచ్చిందని చెప్పొచ్చు. అయితే విమర్శకుల నుండి కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయనుకోండి అది వేరే సంగతి.

ఇప్పుడు తాజాగా ఈ విమర్శలపై ఈ సినిమా దర్శకుడు టీఎన్ కృష్ణ స్పందించి తనదైన శైలిలో విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు తన ట్విట్టర్ ఖాతా ద్వారా. అప్పట్లో నేను తీసిన ‘నువ్వు నేను ప్రేమ’ సినిమాకు కూడా ఇలానే విమర్శలు వచ్చాయి… ద హిందు అనే పత్రికలో అశోక్ కుమార్ అనే క్రిటిక్ అయితే చాలా విమర్శలు గుప్పిస్తూ కథనం రాశాడు.. కానీ ఇప్పుడు ఆసినిమా క్లాసిక్ అయింది.. అలానే ఇప్పుడు నేను తీసిన ‘హిప్పీ’ సినిమా విషయంలో కూడా జరుగుతుంది. హిస్టరీ మళ్లీ రిపీట్ అవ్వబోతుంది.. ‘హిప్పీ’ కూడా ఓ క్లాసిక్ అవుతుంది. ధియేటర్ల లో సినిమా చూసిన యూత్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని ట్వీట్ లో పేర్కొన్నారు. మరి చూద్దాం.. టీఎన్ కృష్ణ చెప్పినట్టు ఈ సినిమా హిస్టరీ రిపీట్ చేస్తుందో.. లేదో..!

కాగా ఈ సినిమాలో హీరో కార్తీకేయ సరసన దిగంగన హీరోయిన్‌గా నటించంగా.. JD చక్రవర్తి ఒక ముఖ్య పాత్రలో నటించారు.. భారీ బడ్జెట్ నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. నివాస్ ప్రసన్న సంగీతం అందించాడు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి ఆర్.డి రాజశేఖర్.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here