తెలుగు సినీ ఇండస్ట్రీలో కామెడీ బ్రహ్మ బ్రహ్మనందం చేసిన కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తన హావభావాలతోనే నవ్వు పుట్టించగల మోస్ట్ సీనియర్ అండ్ స్టార్ కమెడియన్. ఇప్పుడొచ్చే ఎంతో మంది కమెడియన్స్ కు ఆయన స్పూర్తి.. ఇక బ్రహ్మీ తరవాత వచ్చిన జనరేషన్ లో అంత మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ సునీల్. గోదావరి యాసతో.. పంచ్ డైలాగ్స్ తో.. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో తను కూడా తన కామెడీతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేవాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది. ఇంకేముంది నవ్వుల వర్షమే కదా. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. వీరి కాంబినేషన్ లో మూవీ రాబోతుంది కానీ.. టాలీవుడ్ లో కాదు.. బాలీవుడ్ లో వీరిద్దరితో సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. హార్రర్ కామెడీగా ఈ సినిమా రూపొందిస్తున్నారట. ఇంకా అశ్చకరమైన విషయం ఏంటంటే.. ఈసినిమాలో సన్నీ లియోన్ ఫీమేల్ లీడ్ గా చేస్తుందట. మందన కరిమి అనే హీరోయిన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.
ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తారట. మహేందర్ దరివాల్ మరియు పరమ్ దీప్ సందు ఈసినిమాను నిర్మిస్తున్నారు. మరి హార్రర్ కామెడీ జోనర్ లో మన టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వచ్చి ఘన విజయం సాధించాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాపై మరింత సమాచారం తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి మన కమెడియన్లు ఈ సినిమాతో బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తారేమో చూద్దాం.
[youtube_video videoid=wLxK238WHqg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: