మహర్షి తరువాత మరో ఛాన్స్ కొట్టేసిన అల్లరి నరేష్..!

Allari Naresh Grabs Another Opportunity,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allari Naresh Gets an Another Movie Chance,Allari Naresh Next Film Updates,Allari Naresh Next Project Details,Allari Naresh New Movie News
Allari Naresh Grabs Another Opportunity

చాలా కాలంగా వరుస పరాజయాలతో కెరీర్ లో కాస్త వెనుకబడిన అల్లరి నరేష్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మహర్షి లాంటి సినిమాలో శివ అనే ఓ కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. మహేష్ స్నేహితుడిగా ఈ సినిమాలో అల్లరి నరేష్ అమాయకత్వంతో కూడిన నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకు మహేష్ బాబు పాత్ర ఎంత హైలెట్ గా నిలిచిందో.. నరేష్ పాత్ర కూడా అంతే హైలెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాతో నరేష్ కు మంచి గుర్తింపు రావడంతో పాటు.. అవకాశాలు కూడా క్యూ కట్టాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలోనే మాస్‌ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘డిస్కో రాజా’ చిత్రంలో నరేశ్‌ కు కీలక పాత్రలో నటించే అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. మొదట ఈ పాత్ర కోసం సునీల్‌ను ఎంపికచేసుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర నరేశ్‌కు దక్కినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేశ్‌ ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు.

[subscribe]
[youtube_video videoid=rkgIK9xsXBY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 6 =