పైరసీ పై కేంద్ర నిర్ణయం – జైలు శిక్ష, జరిమానా

Central Government Takes Right Decision About Piracy,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Central Government About Piracy Issue,Central Government Response on Piracy Movies,3 Year Jail for Viewing Piracy,Central Government Right Decision About Online Films
Central Government Takes Right Decision About Piracy

చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఏ సినిమా అయినా కానీ ఈ మధ్య పైరసీ అవ్వడం చాలా ఈజీ అయిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే పైరసీరాయుళ్లు మాత్రం విడుదలైన కొద్ది క్షణాలకే సినిమాను సైట్లలో పెట్టేస్తున్నారు. ఈమధ్య కొత్తగా బెదిరించడం కూడా నేర్చుకున్నారు. 2.0 సినిమాను ముందే పైరసీ చేసి సైట్లలో పెడతామని బెదిరించిన దాఖలాలు కూడా చూశాము. అలా చలనచిత్ర రంగానికి పెద్ద సమస్యగా మారింది పైరసీ భూతం.

అయితే ఇన్ని రోజులకు కాస్త ఊరట కలిగించేవిధంగా కేంద్రం పైరసీపై కొన్ని చర్యలు తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్ర కేబినేట్ ఓ సంచ‌ల‌న తీర్పునిచ్చింది. ఇకపై సినిమాకి చెందిన సంబంధిత వ్యక్తుల అనుమతులు లేకుండా సినిమాను కాపీ చేయాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా సినిమాటోగ్రఫీ 1952 సవరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.దీనిని ఎవ‌రైన ఉల్లంఘిస్తే మూడేళ్ల కారాగార శిక్ష లేదా పది లక్షల రూపాయల జరిమానా కట్టే విధంగా చర్యలు తీసుకోనున్నారు. దీంతో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కేంద్రం తీసుకున్న నిర్ణయంతోనైనా పైరసీ కాస్త తగ్గుతుందేమో చూద్దాం..

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here