మాసివ్ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న `ఆర్ ఆర్ ఆర్`… రోజు రోజుకి అంచనాలు పెంచేస్తోంది. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం కావడం… `అపజయమెరుగని దర్శకుడు` రాజమౌళి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడం వంటి అంశాలు ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ నాటి నుంచే సూపర్ బజ్ పుట్టిస్తే… నిర్మాణ దశలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తూ ఈ చిత్రంపై ఉన్న క్రేజ్‌ని `స్కై లెవల్`కు తీసుకు వెళుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక `ఆర్ ఆర్ ఆర్`కు సంబంధించి తాజా కబురు ఏమిటంటే… ప్రస్తుతం రామ్ చరణ్ అండ్ కో పై భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ జరుగుతోందట. ఈ సన్నివేశంలో దాదాపు వేయిమంది ఫైటర్స్, జూనియర్ ఆర్టిస్ట్‌లు పాల్గొంటున్నారని సమాచారం. అంతేకాదు… సినిమాలో ఓ కీలక సన్నివేశంలో వచ్చే చిన్న పోరాట ఘట్టం ఇదని తెలుస్తోంది. మొత్తమ్మీద… రాజమౌళి అండ్ టీమ్ మాస్ ఆడియన్స్‌కు మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌నే అందిస్తుందనే చెప్పొచ్చు. డీవీవీ దానయ్య ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2020 వేసవికి తెరపైకి రానుంది.
[youtube_video videoid=-fIckspYhns]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: