ట్యాగ్ · 29 కథనాలు

అభిమాన హీరో సినిమాకే గెస్ట్ గా వచ్చిన వేళ

నేను ఏ పాత్ర చేసినా అది నాలో ఉన్న క్యారెక్టరే..!
పెట్ డాగ్ ను పరిచయం చేసిన విజయ్..!

లాక్ డౌన్ సమయం లో బిజీ గా విజయ్ దేవరకొండ

17వేల కుటుంబాలకు సాయం - ప్రస్తుతం రెస్ట్ మోడ్..!
రిలాక్స్ మూడ్ లో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ "మిడిల్ క్లాస్ ఫండ్ "
విజయ్ దేవరకొండ మూవీ టైటిల్ "లిగర్ " ?
విజయ్ దేవరకొండ మాస్ లుక్
కొత్త లుక్‌లో విజయ్ దేవరకొండ?
ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ దేవరకొండ సంచలనం

"హ్యాపీ బర్త్ డే "

విజయ్ దేవరకొండకు కు 'మా' మద్దతు..!
50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న విజయ్, పూరి మూవీ
'మిడిల్ క్లాస్ ఫౌండేషన్' ద్వారా విజయ్ సాయం..!
ఛాలెంజ్ పూర్తి చేయలేను...అమ్మ తిడుతోంది..!
విజయ్ దేవరకొండ న్యూ మూవీ
పోలీస్ ఆఫీసర్ గా నటిస్తా - విజయ్ దేవరకొండ
తల్లికి విజయ్ ప్రామిస్ - ఎప్పుడూ సంతోషంగా ఉంచుతా
అతి తక్కువ కాలంలో విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ గా ఎదిగాడు. భయపడకుండా తను మాట్లాడే మాటలు.. చేతలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకుని యూత్‌లో మాంచి ఫాలోయింగ్ సంపాదించాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

అభిమాన హీరో సినిమాకే గెస్ట్ గా వచ్చిన వేళ
విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఎక్కడో కనిపించీ కనిపించని చిన్నపాత్రలో నటించి... ఆ తరువాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని ఫ్రెండ్ గా కనిపించి కొంచెం నోటెడ్ అయ్యాడు. ఇక ఆ తరువాత వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అందరి కంట్లో పడ్డాడు. పెళ్లి చూపులు సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

నేను ఏ పాత్ర చేసినా అది నాలో ఉన్న క్యారెక్టరే..!
మన సినిమాలో చేసే పాత్రలు మనలోనే ఉంటాయి అంటున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా ఇలా ప్రతి సినిమాలోనూ తనను కొత్తగా ఆవిష్కరించుకుంటూ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతమంది యంగ్ హీరోలు ఎన్నో ఏళ్ళనుండి టాలీవుడ్ లో సక్సెస్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే వున్నారు. కానీ విజయ్ మాత్రం చాలా తక్కువ టైంలోనే సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు.
పెట్ డాగ్ ను పరిచయం చేసిన విజయ్..!
లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమతమైన విజయ్ దేవరకొండ తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం షూటింగ్ లేవు చాలా ఖాళీగా ఉండటంతో ఈ ఈ టైంను బాగా ఉపయాగించుకుంటున్నాడు. విజయ్ ఇటీవలే ఫిల్మ్ నగర్ లో ఒక ఇంటిని కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఇంటి ఇంటీరియర్ డెకరేషన్ చేసే పనిలో బిజీగా వున్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన సోషల్ మీడియా ద్వారా సినిమాతో పాటు పర్సనల్ విషయాలు షేర్ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా మరో పోస్ట్ చేసి తన ఫ్యామిలీలోకి మరొక మెంబర్ వచ్చారంటూ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పెట్ డాగ్‌కి సంబంధించిన ఫోటోలు షేర్ చేశాడు. ఇందులోని ఓ…

లాక్ డౌన్ సమయం లో బిజీ గా విజయ్ దేవరకొండ
"పెళ్ళి చూపులు ", "అర్జున్ రెడ్డి ", "గీత గోవిందం " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడి విజయ్ పై క్రేజ్ పెరిగింది. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్ ) లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

17వేల కుటుంబాలకు సాయం - ప్రస్తుతం రెస్ట్ మోడ్..!
కేవలం రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలు అనిపించుకుంటున్నారు మన హీరోలు. ఈ కరోనా వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి సాయం చేసేందుకు మన హీరోలు ముందుకొచ్చి ఆర్థిక సాయంతో పాటు ఆకలి బాధలు కూడా తీరుస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌ను ఆదుకోవడానికి హీరో విజయ్ దేవరకొండ కూడా మిడిల్ క్లాస్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. తాను స్వయంగా రూ.25 లక్షలు ఈ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారు. ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా విరాళాలు సేకరించి ఎంతో మంది కుటుంబాలకు ఆసరాగా నిలిచారు. ఈ ఫండ్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో మధ్యతరగతి కుటుంబానికి వెయ్యి రూపాయల విలువైన నిత్యావసరాలు అందజేసేలా ప్లాన్…
రిలాక్స్ మూడ్ లో విజయ్ దేవరకొండ
"పెళ్ళిచూపులు " మూవీ తో విజయం సాధించి సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ "గీత గోవిందం " మూవీ తో టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్ ) మూవీ లో నటిస్తున్నారు. సుమారు 50శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ లాక్ డౌన్ కారణం గా షూటింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే.

విజయ్ దేవరకొండ "మిడిల్ క్లాస్ ఫండ్ "
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న మధ్య తరగతి కుటుంబాల సహాయార్థం హీరో విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ ఫండ్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాను 25 లక్షలతో ఫండ్ ఏర్పాటు చేసి ప్రజలనుండి డొనేషన్స్ కలెక్ట్ చేసి నెల రోజులలో దాదాపు 17 వేల కుటుంబాలకు విజయ్ సహాయం చేశారు. విజయ్ చేసిన ఈ మంచి పనికి ప్రజల అభినందనలు అందుకున్నారు.
విజయ్ దేవరకొండ మూవీ టైటిల్ "లిగర్ " ?
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా మూవీ యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్ ) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాక్సర్ గా విజయ్ నటిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కథానాయిక కాగా రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ముంబై లో ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణం గా నిలిచిపోయింది.
విజయ్ దేవరకొండ మాస్ లుక్
సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ దేవరకొండ అధిక సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం " మూవీతో విజయ్ యెనలేని క్రేజ్ పెంపొందించుకున్నారు. చిత్ర జయాపజయాలతో సంబంధం లేకుండా విజయ్ ను అభిమానించే వారు ఎక్కువయ్యారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్ )మూవీ లో నటిస్తున్నారు. ఫైటర్ గా నటిస్తున్న విజయ్ ఈ మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
కొత్త లుక్‌లో విజయ్ దేవరకొండ?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ త్వరలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. 'ఇస్మార్ట్' డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ పూర్తి చేసుకుంది. లాక్‌డౌన్ పిరియడ్ ముగిసిన తరువాత ఈ చిత్రానికి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ దేవరకొండ సంచలనం
‘పెళ్ళిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’.. ఇలా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్‌తో ఈ తరం ప్రేక్షకులకు చేరువయ్యాడు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ. సినిమాలతోనే కాదు.. సోషల్ మీడియాలోనూ తనదైన బాణీతో సంచలనం సృష్టిస్తున్నాడీ టాలెంటెడ్ హీరో. ఎంతలా అంటే.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలను సైతం అధిగమించి ఇన్‌స్టాగ్రామ్‌లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు ఈ “రౌడీ హీరో”.

"హ్యాపీ బర్త్ డే "
"నువ్విలా ", లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ " వంటి మూవీస్ లో చిన్న పాత్రలలో నటించిన విజయ్ దేవరకొండ సక్సెస్ ఫుల్ "ఎవడే సుబ్రమణ్యం " మూవీ తో గుర్తింపుపొందారు. సూపర్ హిట్ "పెళ్ళి చూపులు "మూవీతో హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ "అర్జున్ రెడ్డి "మూవీ తో ప్రేక్షక, అభిమానులలో సెన్సేషనల్ హీరోగా విజయ్ క్రేజ్ పెంపొందించుకున్నారు. ఆ మూవీ లో ఫ్రస్టేటెడ్ లవర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. విజయ్ హీరోగా నటించిన "గీత గోవిందం "మూవీ ఘనవిజయం సాధించి 100కోట్ల క్లబ్ లో చేరింది.

విజయ్ దేవరకొండకు కు 'మా' మద్దతు..!
మొత్తానికి విజయ్ ఏం చేసినా సెన్సేషనే అని మరోసారి నిరూపించాడు. సెలబ్రిటీస్ మీద తప్పుడు వార్తలు రావడం కామన్ థింగ్. ఇక వాటిని ముందు సీరియస్ తీసుకున్నా ఇప్పుడు పట్టించుకోవట్లేదు సెలబ్రిటీస్. అయితే విజయ్ మీద కూడా గతంలో చాలా రూమర్స్ వచ్చాయి. విజయ్ కూడా వాటిని పట్టించుకోలేదు. కానీ ఈసారి మాత్రం తన సాయం చేసే విషయంలో.. ఛారిటీ విషయంలో తప్పుడు కథనాలు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసాడు. అంతే కాదు ఒక స్పెషల్ వీడియో కూడా తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. టాలీవుడ్ మొత్తం విజయ్ కు సపోర్ట్ గా వచ్చింది. మెగా స్టార్ నుండి ప్రతి ఒక్కరు మద్దతుగా నిలుస్తామని తెలిపారు.
తప్పుడు వార్తలపై విజయ్ ఆగ్రహం - విజయ్ కు మద్దతుగా ఇండస్ట్రీ..!
ఏ విషయాన్నైనా ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పడం రౌడీ హీరో విజయ్ కు మొదటి నుండి అలవాటే. ఆ యాటిట్యూడ్ నచ్చే విజయ్ ను అంతలా ఇష్టపడతారు ఫ్యాన్స్. యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక తాజాగా మరోసారి విజయ్ దేవరకొండ తనపై తప్పుడు వార్తలు రాస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరోనా వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందించేలా ‘ది దేవరకొండ ఫౌండేషన్’ స్థాపించి అందులో ‘మిడిల్ క్లాస్ ఫండ్’తో సహాయక కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఫౌండేషన్ ద్వారా నిత్యావసర వస్తువులు కూడా లేక భాదపడుతున్న ఎంతో మందికి సాయం అందిస్తున్నారు.
50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న విజయ్, పూరి మూవీ
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ఫైటర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సరికొత్త పాత్రలో దర్శనమివ్వనున్నాడు విజయ్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నాయికగా నటిస్తుండగా.. ప్రముఖ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది.
'మిడిల్ క్లాస్ ఫౌండేషన్' ద్వారా విజయ్ సాయం..!
కరోనా వ్యాధి అరికట్టేందుకు గానూ ప్రభుత్వాలు తమ ప్రయత్నాలు తాము చేస్తుండగా... మరో పక్క సెలబ్రిటీస్ దగ్గరనుండి సామాన్య ప్రజల వరకూ ఎవరికి తోచింది వారు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. కొంత మంది పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటే.. కొంత మంది నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. కొంతమంది అన్నం వండి పేదలకు పెడుతున్నారు.
ఛాలెంజ్ పూర్తి చేయలేను...అమ్మ తిడుతోంది..!
ప్రస్తుతం టాలీవుడ్ లో 'బి ది రియల్ మ్యాన్' ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో పలు స్టార్ హీరోలు పాల్గొని ఛాలెంజ్ ను పూర్తి చేశారు. చిరంజీవి నుండి వెంకటేష్, ఎన్టీఆర్, చరణ్ వంటి స్టార్స్ మరియు రాజమౌళి, కొరటాల శివ లాంటి డైరెక్టర్స్ ఈ ఛాలెంజ్ పూర్తి చేసి, రియల్ మెన్ అనిపించుకున్నారు. కానీ ఇక్కడ ఒక హీరో మాత్రం ఛాలెంజ్ ను పూర్తి చేయలేనని చెపుతున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు విజయ్ దేవరకొండ.
విజయ్ దేవరకొండ న్యూ మూవీ
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్ ) లో నటిస్తున్న విషయం తెలిసిందే. మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్న విజయ్ ఈ మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశిస్తున్నారు. విజయ్ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పోలీస్ ఆఫీసర్ గా నటిస్తా - విజయ్ దేవరకొండ
కరోనా మహమ్మారి కారణంగా జన జీవనం కష్టాలపాలయింది. ప్రజల ప్రాణ రక్షణ కై తమ ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య బృందాలు, పోలీస్ శాఖ కు కృతజ్ఞతలు తెలపాల్సిందే. పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ ఆధ్వర్యంలో హీరో విజయ్ దేవరకొండ కర్తవ్య దీక్షతో పనిచేస్తున్న పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు విజయ్ సమాధాన మిచ్చారు.