లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమతమైన విజయ్ దేవరకొండ తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం షూటింగ్ లేవు చాలా ఖాళీగా ఉండటంతో ఈ ఈ టైంను బాగా ఉపయాగించుకుంటున్నాడు. విజయ్ ఇటీవలే ఫిల్మ్ నగర్ లో ఒక ఇంటిని కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఇంటి ఇంటీరియర్ డెకరేషన్ చేసే పనిలో బిజీగా వున్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన సోషల్ మీడియా ద్వారా సినిమాతో పాటు పర్సనల్ విషయాలు షేర్ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా మరో పోస్ట్ చేసి తన ఫ్యామిలీలోకి మరొక మెంబర్ వచ్చారంటూ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పెట్ డాగ్‌కి సంబంధించిన ఫోటోలు షేర్ చేశాడు. ఇందులోని ఓ ఫోటోలో తలపై కుక్కని కూర్చోపెట్టుకొని నవ్వుతున్నాడు. మరో ఫోటోలో బెడ్‌పై కుక్కతో ఫోటోకి ఫోజులిచ్చాడు. ఇప్పుడు ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా తరువాత టాలీవుడ్ లో స్టార్ హీరో అయిపోయాడు విజయ్. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ, మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: