50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న విజయ్, పూరి మూవీ

Vijay Deverakonda New Movie Fighter Completes Fifty Percent Of Its Movie Shooting

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ఫైటర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో స‌రికొత్త పాత్ర‌లో దర్శనమివ్వనున్నాడు విజయ్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నాయికగా నటిస్తుండగా.. ప్రముఖ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ దిన పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు విజయ్. అవేమిటంటే.. ఇంతవరకు 50 శాతం చిత్రీకరణ పూర్తయిందని.. ఈ చిత్రాన్ని 2021లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నాడు. అలాగే, లాక్ డౌన్ పీరియడ్ అనంతరం మిగిలిన భాగం చిత్రీకరణ జరుగనుందని వెల్ల‌డించాడు.

కాగా.. బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ స‌మ‌ర్ప‌ణ‌లో పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ – ఇండియా ఫిల్మ్.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.