17వేల కుటుంబాలకు సాయం – ప్రస్తుతం రెస్ట్ మోడ్..!

Tollywood Actor Vijay Deverakonda Who Offered Help To 17000 Families Through His Middle Class Fund Suspends It On A Temporary Basis
Tollywood Actor Vijay Deverakonda Who Offered Help To 17000 Families Through His Middle Class Fund Suspends It On A Temporary Basis

కేవలం రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలు అనిపించుకుంటున్నారు మన హీరోలు. ఈ కరోనా వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి సాయం చేసేందుకు మన హీరోలు ముందుకొచ్చి ఆర్థిక సాయంతో పాటు ఆకలి బాధలు కూడా తీరుస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌ను ఆదుకోవడానికి హీరో విజయ్ దేవరకొండ కూడా మిడిల్ క్లాస్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. తాను స్వయంగా రూ.25 లక్షలు ఈ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారు. ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా విరాళాలు సేకరించి ఎంతో మంది కుటుంబాలకు ఆసరాగా నిలిచారు. ఈ ఫండ్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో మధ్యతరగతి కుటుంబానికి వెయ్యి రూపాయల విలువైన నిత్యావసరాలు అందజేసేలా ప్లాన్ చేసుకున్నారు. తమ వెబ్‌సైట్‌ ద్వారా సాయం కోరిన వారికి సరుకులు అందజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇక ఈ వివరాలు ఎప్పటికప్పుడు విజయ్ తెలియచేస్తూనే వున్నారు. మొత్తం 8,515 మంది దాతలు విరాళాల కింద రూ. 1,50,24,549 మిడిల్ క్లాస్ ఫండ్‌కు అందజేశారు. మొత్తంగా రూ. 1,71,21,103 ఫండ్‌తో 17,723 కుటుంబాలకు సాయం అందించినట్టు తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో తాత్కాలికంగా మిడిల్ క్లాస్ ఫండ్‌ను రెస్ట్ మోడ్‌లో ఉంచుతున్నట్టు విజయ దేవరకొండ తెలియజేసాడు. అంతేకాదు ప్రజలకు సేవ చేయడంలో తనకు సాయం అందించిన ప్రతి ఒక్కరికీ విజయ్ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here