విజయ్ దేవరకొండ “మిడిల్ క్లాస్ ఫండ్ “

Tollywood Actor Vijay Deverakonda Announce Suspending Of Middle Class Fund On A Temporary Basis

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న మధ్య తరగతి కుటుంబాల సహాయార్థం హీరో విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ ఫండ్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాను 25 లక్షలతో ఫండ్ ఏర్పాటు చేసి ప్రజలనుండి డొనేషన్స్ కలెక్ట్ చేసి నెల రోజులలో దాదాపు 17 వేల కుటుంబాలకు విజయ్ సహాయం చేశారు. విజయ్ చేసిన ఈ మంచి పనికి ప్రజల అభినందనలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ కాలం ముగిసి ప్రజలు తమ పనులలో నిమగ్నమవుతున్న కారణంగా మిడిల్ క్లాస్ ఫండ్ ను నిలిపివేసినట్టుగా, అవసరపడితే తిరిగి ఫండ్ ద్వారా హెల్ప్ చేయడం జరుగుతుందని విజయ్ చెప్పారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “ఫైటర్ “(వర్కింగ్ టైటిల్ )లో నటిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ బాక్సర్ గా నటిస్తున్న ఈ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాష లో కూడా రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.