విజయ్ దేవరకొండ మాస్ లుక్

Tollywood Crazy Actor Vijay Deverakonda To Wow Audience With His New Mass Look

సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ దేవరకొండ అధిక సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. బ్లాక్ బస్టర్ “గీత గోవిందం ” మూవీతో విజయ్ యెనలేని క్రేజ్ పెంపొందించుకున్నారు. చిత్ర జయాపజయాలతో సంబంధం లేకుండా విజయ్ ను అభిమానించే వారు ఎక్కువయ్యారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఫైటర్ “(వర్కింగ్ టైటిల్ )మూవీ లో నటిస్తున్నారు. ఫైటర్ గా నటిస్తున్న విజయ్ ఈ మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు పూరి జగన్నాథ్ తన మూవీస్ లో హీరోలను మాస్ లుక్ తో ప్రెజెంట్ చేస్తారన్న విషయం తెలిసిందే. క్లాస్ లుక్ లో ఉండే హీరో రామ్ పోతినేని ని మాస్ లుక్ తో నటింపజేసి “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ తో హిట్ కొట్టారు. ఇప్పుడు ఫైటర్ మూవీ లో ఎప్పుడూ లేని విధంగా విజయ్ ను ఒక సరికొత్త లుక్ తో ప్రేక్షకులకు పూరి జగన్నాథ్ ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ మూవీ తరువాత విజయ్ , దర్శకులు శివ నిర్వాణ, మోహన్ కృష్ణ ఇంద్రగంటి చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + two =