కరోనా వ్యాధి అరికట్టేందుకు గానూ ప్రభుత్వాలు తమ ప్రయత్నాలు తాము చేస్తుండగా… మరో పక్క సెలబ్రిటీస్ దగ్గరనుండి సామాన్య ప్రజల వరకూ ఎవరికి తోచింది వారు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. కొంత మంది పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటే.. కొంత మంది నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. కొంతమంది అన్నం వండి పేదలకు పెడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న విజయ్ దేవరకొండ ఇప్పుడు తాను కూడా తన వంతు సాయం చేయడానికి వచ్చాడు. నిజానికి ఇన్ని రోజులు విజయ్ ఎందుకు విరాళం ఇవ్వలేదా అని తెగ వార్తలు వచ్చాయి. అయితే తనకు కూడా కాస్త ఆర్థికంగా వెసులుబాటు కాలేక ఇన్ని రోజులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఒక పెద్ద ప్లాన్ తోనే వస్తున్నట్టు ఒక వీడియో ద్వారా తెలిపాడు. యువతకు ఉద్యోగాలు, మధ్యతరగతి ప్రజలకు నిత్యావసరాలను అందించడానికి రెండు ఫౌండేషన్స్ స్థాపించి కోటి ముప్పై లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. 2000 కుటుంబాలకు నిత్యాసరాలను అందిచండానికి విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ ఫౌండేషన్(ఎంసీఎఫ్)ను స్థాపించారు. దాని కోసం రూ.25 లక్షల నిధిని కేటాయించాడు విజయ్. ఇక ఈ పౌండేషన్ కు బాగానే ఆదరణ పెరుగుతుంది.
సినీ పరిశ్రమ నుండే కాకుండా బయట నుండి కూడా దీనికి విరాళాలు అందుతున్నాయట. అంతేకాదు యువతకు ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాడు. ఇప్పటికే ఓ 50 మంది యువతకు శిక్షణ కూడా ఇస్తున్నాడట. ఇంకా ముందు ముందు కూడా ఎంతో మంది యువతకు తన ఫౌండేషన్ ద్వారా ఉద్యోగావకాశాలు కలిపిస్తానని చెప్పాడు. ఏదిఏమైనా రౌడీ హీరో అందరికంటే కాస్త భిన్నమే అని చెప్పొచ్చు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































