“పెళ్ళిచూపులు ” మూవీ తో విజయం సాధించి సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ “గీత గోవిందం ” మూవీ తో టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న “ఫైటర్ “(వర్కింగ్ టైటిల్ ) మూవీ లో నటిస్తున్నారు. సుమారు 50శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ లాక్ డౌన్ కారణం గా షూటింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా మహమ్మారి కారణం గా లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ నిలిచిపోయి సినీ సెలబ్రిటీస్ ఇంటికే పరిమితం అయ్యారు. లాక్ సమయంలో విజయ్ తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. లాక్ డౌన్ కారణం గా ఇబ్బందులు పడుతున్న మధ్య తరగతి కుటుంబాల సహాయార్థం “మిడిల్ క్లాస్ ఫండ్ ” ను విజయ్ ఏర్పాటు చేశారు. ఆ ఫండ్ తో పలు కుటుంబాలకు విజయ్ సహాయం అందించారు. షూటింగ్స్ ప్రారంభానికై ఎదురుచూస్తున్న విజయ్ రిలాక్స్ మూడ్ లో ఉన్న ఫోటోను చూడండి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: