
ట్యాగ్ · 29 కథనాలు · పేజీ 2

అవసరమైతే 'అమ్మ' చున్నీ వాడండి...!
విజయ్ దేవరకొండ చాలా స్మార్ట్

ఇంకా పిల్లాడినే అనుకొంటున్నా - విజయ్ దేవరకొండ

`విజయ్ దేవరకొండ 10` కోసం రూ. 5 కోట్ల సెట్?
తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి - విజయ్ చిత్రం
యూట్యూబ్ లో విజయ్ దేవరకొండ నయా సెన్సేషన్
ఇన్ స్టా గ్రామ్ లో విజయ్ దేవరకొండ దూకుడు
విజయ్ దేవరకొండ అభిమానులకు క్రిస్మస్ సర్ ప్రైజ్

తెలంగాణ పోలీసులను ప్రశంసించిన విజయ్ దేవరకొండ..!
వరుస పెట్టి అందరూ పోలీసులపై ప్రశంసలు కురిపించడం మొదలుపెట్టారు. ఒకరి తర్వాత ఒకరు పోలీసులను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. మహేష్ బాబు తో మొదలైన ఈ ప్రశంసల పరంపర కొనసాగుతూనే ఉంది. మహేష్ బాబు, తర్వాత చిరు.. ఆ తర్వాత వెంకీ.. ఇప్పుడు యంగ్ అండ్ రౌడీ హీరో విజయ్ కూడా ఈ లిస్ట్ లో చేరాడు. అయితే విజయ్ మాత్రం డైరెక్ట్ గా తెలంగాణ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించి.. పోలీసులను ప్రశంసించాడు. పోలీసులు రియల్ హీరోస్ అంటూ.. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారని విజయ్ ప్రశంసించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున తెలంగాణ పోలీసులకు…
అవసరమైతే 'అమ్మ' చున్నీ వాడండి...!
అవసరమైతే అమ్మ చున్నీ వాడండి అని చెబుతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. దేశవ్యాప్తంగా కరోనాను అరికట్టించేందుకు ఎవరికి వారు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇంట్లోనే ఉండి కరోనాను నిర్మూలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు ఇస్తూనే ఉన్నారు. ఇక సెలబ్రిటీస్ కూడా తమ సూచనలను ఇస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎంతోమంది పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖలు జాగ్రత్తలు చెప్పగా.. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా తన సూచనలు చెబుతున్నాడు.
విజయ్ దేవరకొండ చాలా స్మార్ట్
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ముంబై లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఇటీవలే ఆమె కూడా షూటింగ్ లో జాయిన్ అయింది. ఈ నేపథ్యంలో అప్పుడే అమ్మడు మన యంగ్ హీరోపై ప్రశంసలు కురిపించేస్తుంది.

ఇంకా పిల్లాడినే అనుకొంటున్నా - విజయ్ దేవరకొండ
బ్లాక్ బస్టర్ "పెళ్ళిచూపులు" మూవీ తో టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి" మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. ఘనవిజయం సాధించిన "గీత గోవిందం" తో స్టార్ డమ్ పొందిన విజయ్ దేవరకొండ "టాక్సీవాలా" మూవీ విజయం తో టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు.

`విజయ్ దేవరకొండ 10` కోసం రూ. 5 కోట్ల సెట్?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఓ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. `ఇస్మార్ట్` డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో బాక్సర్ గా దర్శనమివ్వబోతున్నాడు విజయ్. ఇటీవలే పట్టాలెక్కిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ సమర్పణలో పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నాయికగా నటించనుందని ప్రచారం సాగుతోంది.
తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి - విజయ్ చిత్రం
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా `ఇస్మార్ట్` డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ బాక్సర్ పాత్రలో దర్శనమివ్వనున్న ఈ సినిమా... ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. కాగా, తాజాగా ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ కూడా పూర్తయిందని సమాచారం. ఈ షెడ్యూల్ లో విజయ్ తదితరులపై కొన్ని కీలక దృశ్యాలను చిత్రీకరించారని తెలిసింది.
యూట్యూబ్ లో విజయ్ దేవరకొండ నయా సెన్సేషన్
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండకి యూత్ లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జయాపజయాలకు అతీతంగా తనకంటూ ఓ ప్రత్యేక అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు విజయ్. కేవలం తెలుగునాటే కాదు.. ఇతర దక్షిణాది పరిశ్రమల్లోనూ, హిందీ చిత్రసీమలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడీ టాలెంటెడ్ స్టార్. ఇలాంటి క్రేజ్ ఉంది కాబట్టే.. విజయ్ దేవరకొండ పేరిట ఎప్పటికప్పుడు ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతూనే ఉంది.
ఇన్ స్టా గ్రామ్ లో విజయ్ దేవరకొండ దూకుడు
తెలుగునాట అనతి కాలంలోనే `యూత్ ఐకాన్`గా ఎదిగాడు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. కేవలం సినిమాలతోనే కాదు... తన ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ తోనూ, స్టైల్ ఫ్యాక్టర్ తోనూ యూత్ ని ఎప్పటికప్పుడు ఎట్రాక్ట్ చేస్తున్నాడీ బ్యాంకబుల్ హీరో. సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకుపోతున్న ఈ టాలెంటెడ్ స్టార్... సోషల్ మీడియాలోనూ తనదైన హవా చాటుకుంటున్నాడు.
విజయ్ దేవరకొండ అభిమానులకు క్రిస్మస్ సర్ ప్రైజ్
"పెళ్ళి చూపులు ", "అర్జున్ రెడ్డి ", "గీతగోవిందం " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో స్టార్ హీరో గా ఎదిగిన విజయ్ దేవరకొండ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. విజయ్ దేవరకొండ తన అభిమానులకై పలు కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. బర్త్ డే కు ఐస్ క్రీములు పంచడం, కొన్ని సందర్భాలలో అభిమానులకు గిఫ్ట్స్ ఇవ్వడం వంటివి చేస్తారు.