కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Vijay Deverakonda New Movie News

ట్యాగ్ · 49 కథనాలు

Vijay Deverakonda Geetha Govindam Movie Sequel Update,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay Deverakonda,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda New Movie News,Vijay
సినిమా వార్తలు

బ్లాక్ బస్టర్ గీత గోవిందం మూవీ సీక్వెల్ అప్ డేట్

అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ గీతగోవిందం మూవీ 2018 ఆగష్ట్ 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది.ఈ సినిమాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నటించిన విజయ్ దేవరకొండ కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఈ మూవీ లో రష్మిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ అందుకున్నారు. విజయ్, రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీతో హీరో విజయ్, రష్మిక స్టార్…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పెట్ డాగ్ తో విజయ్ దేవరకొండ

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "లైగర్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అనన్య పాండే కథానాయిక. ఈ మూవీ లో బాక్సర్ గా నటిస్తున్న విజయ్ , థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. ముంబై లో ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న "లైగర్ " మూవీ కరోనా కారణం గా నిలిచిపోయింది. ఇప్పుడు ముంబై లో మరో షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పూరి జగన్నాథ్ బర్త్ డే కు విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు

సక్సెస్ ఫుల్ "బద్రి " మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన పూరి జగన్నాథ్ "ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ", "ఇడియట్ ", "అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి ", "పోకిరి ", "దేశముదురు ", "చిరుత ", "టెంపర్ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని ని బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ లో మరో కోణం లో ఆవిష్కరించి పూరి ఘనవిజయం సాధించారు . పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా మూవీ "ఫైటర్ "ను తెరకెక్కిస్తున్నారు.

Team TFNవాట్సాప్
I See Myself In Every Character That I Play Says Tollywood Crazy Actor Vijay Deverakonda
సినిమా వార్తలు

నేను ఏ పాత్ర చేసినా అది నాలో ఉన్న క్యారెక్టరే..!

మన సినిమాలో చేసే పాత్రలు మనలోనే ఉంటాయి అంటున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా ఇలా ప్రతి సినిమాలోనూ తనను కొత్తగా ఆవిష్కరించుకుంటూ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతమంది యంగ్ హీరోలు ఎన్నో ఏళ్ళనుండి టాలీవుడ్ లో సక్సెస్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే వున్నారు. కానీ విజయ్ మాత్రం చాలా తక్కువ టైంలోనే సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పెట్ డాగ్ ను పరిచయం చేసిన విజయ్..!

లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమతమైన విజయ్ దేవరకొండ తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం షూటింగ్ లేవు చాలా ఖాళీగా ఉండటంతో ఈ ఈ టైంను బాగా ఉపయాగించుకుంటున్నాడు. విజయ్ ఇటీవలే ఫిల్మ్ నగర్ లో ఒక ఇంటిని కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఇంటి ఇంటీరియర్ డెకరేషన్ చేసే పనిలో బిజీగా వున్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు త‌న సోష‌ల్ మీడియా ద్వారా సినిమాతో పాటు ప‌ర్స‌న‌ల్ విష‌యాలు షేర్ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా మరో పోస్ట్ చేసి తన ఫ్యామిలీలోకి మరొక మెంబర్ వచ్చారంటూ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పెట్ డాగ్‌కి సంబంధించిన ఫోటోలు షేర్ చేశాడు. ఇందులోని ఓ…

TFN Adminవాట్సాప్
Tollywood Crazy Hero Vijay Deverakonda Gets Busy In Interior Design Work Of His New Home In Hyderabad
సినిమా వార్తలు

లాక్ డౌన్ సమయం లో బిజీ గా విజయ్ దేవరకొండ

"పెళ్ళి చూపులు ", "అర్జున్ రెడ్డి ", "గీత గోవిందం " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడి విజయ్ పై క్రేజ్ పెరిగింది. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్ ) లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆఫ్ స్క్రీన్ విజయ్ డిఫ‌రెంట్..!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నాడు.

TFN Adminవాట్సాప్
Tollywood Actor Vijay Deverakonda Who Offered Help To 17000 Families Through His Middle Class Fund Suspends It On A Temporary Basis
సినిమా వార్తలు

17వేల కుటుంబాలకు సాయం - ప్రస్తుతం రెస్ట్ మోడ్..!

కేవలం రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలు అనిపించుకుంటున్నారు మన హీరోలు. ఈ కరోనా వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి సాయం చేసేందుకు మన హీరోలు ముందుకొచ్చి ఆర్థిక సాయంతో పాటు ఆకలి బాధలు కూడా తీరుస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌ను ఆదుకోవడానికి హీరో విజయ్ దేవరకొండ కూడా మిడిల్ క్లాస్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. తాను స్వయంగా రూ.25 లక్షలు ఈ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారు. ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా విరాళాలు సేకరించి ఎంతో మంది కుటుంబాలకు ఆసరాగా నిలిచారు. ఈ ఫండ్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో మధ్యతరగతి కుటుంబానికి వెయ్యి రూపాయల విలువైన నిత్యావసరాలు అందజేసేలా ప్లాన్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రిలాక్స్ మూడ్ లో విజయ్ దేవరకొండ

"పెళ్ళిచూపులు " మూవీ తో విజయం సాధించి సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ "గీత గోవిందం " మూవీ తో టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్ ) మూవీ లో నటిస్తున్నారు. సుమారు 50శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ లాక్ డౌన్ కారణం గా షూటింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Tollywood Actor Vijay Deverakonda Announce Suspending Of Middle Class Fund On A Temporary Basis
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ "మిడిల్ క్లాస్ ఫండ్ "

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న మధ్య తరగతి కుటుంబాల సహాయార్థం హీరో విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ ఫండ్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాను 25 లక్షలతో ఫండ్ ఏర్పాటు చేసి ప్రజలనుండి డొనేషన్స్ కలెక్ట్ చేసి నెల రోజులలో దాదాపు 17 వేల కుటుంబాలకు విజయ్ సహాయం చేశారు. విజయ్ చేసిన ఈ మంచి పనికి ప్రజల అభినందనలు అందుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ మూవీ టైటిల్ "లిగర్ " ?

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా మూవీ యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్ ) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాక్సర్ గా విజయ్ నటిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కథానాయిక కాగా రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ముంబై లో ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణం గా నిలిచిపోయింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ మాస్ లుక్

సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ దేవరకొండ అధిక సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం " మూవీతో విజయ్ యెనలేని క్రేజ్ పెంపొందించుకున్నారు. చిత్ర జయాపజయాలతో సంబంధం లేకుండా విజయ్ ను అభిమానించే వారు ఎక్కువయ్యారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్ )మూవీ లో నటిస్తున్నారు. ఫైటర్ గా నటిస్తున్న విజయ్ ఈ మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కొత్త లుక్‌లో విజయ్ దేవరకొండ?

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ త్వరలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. 'ఇస్మార్ట్' డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ పూర్తి చేసుకుంది. లాక్‌డౌన్ పిరియడ్ ముగిసిన తరువాత ఈ చిత్రానికి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'రౌడీ హీరో' కూడా వెబ్ సిరీస్ ల వైపు..!

హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ తక్కువ టైం లోనే నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. కింగ్ ఆఫ్ హిల్స్ అనే పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. రీసెంట్ గా తరుణ్ భాస్కర్ హీరోను హీరోగా పెట్టి 'మీకు మాత్రమే చెప్తా' అనే సినిమా కూడా నిర్మించాడు. అయితే అది అంత విజయం దక్కించుకోలేకపోయింది. ఇక ఒక పక్క సినిమా నిర్మిస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ ల వైపు కూడా విజయ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇన్‌స్టాగ్రామ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ సంచ‌ల‌నం

‘పెళ్ళిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’.. ఇలా యూత్‌ఫుల్ ఎంటర్‌టైన‌ర్స్‌తో ఈ త‌రం ప్రేక్షకులకు చేరువ‌య్యాడు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ. సినిమాల‌తోనే కాదు.. సోష‌ల్ మీడియాలోనూ త‌నదైన బాణీతో సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడీ టాలెంటెడ్ హీరో. ఎంత‌లా అంటే.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలను సైతం అధిగ‌మించి ఇన్‌స్టాగ్రామ్‌లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్ర‌మించాడు ఈ “రౌడీ హీరో”.

Team TFNవాట్సాప్
Tollywood Crazy Actor Vijay Deverakonda Celebrates His Birthday Today
సినిమా వార్తలు

"హ్యాపీ బర్త్ డే "

"నువ్విలా ", లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ " వంటి మూవీస్ లో చిన్న పాత్రలలో నటించిన విజయ్ దేవరకొండ సక్సెస్ ఫుల్ "ఎవడే సుబ్రమణ్యం " మూవీ తో గుర్తింపుపొందారు. సూపర్ హిట్ "పెళ్ళి చూపులు "మూవీతో హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ "అర్జున్ రెడ్డి "మూవీ తో ప్రేక్షక, అభిమానులలో సెన్సేషనల్ హీరోగా విజయ్ క్రేజ్ పెంపొందించుకున్నారు. ఆ మూవీ లో ఫ్రస్టేటెడ్ లవర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. విజయ్ హీరోగా నటించిన "గీత గోవిందం "మూవీ ఘనవిజయం సాధించి 100కోట్ల క్లబ్ లో చేరింది.

Team TFNవాట్సాప్
MAA supports Vijay Deverakonda
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండకు కు 'మా' మద్దతు..!

మొత్తానికి విజయ్ ఏం చేసినా సెన్సేషనే అని మరోసారి నిరూపించాడు. సెలబ్రిటీస్ మీద తప్పుడు వార్తలు రావడం కామన్ థింగ్. ఇక వాటిని ముందు సీరియస్ తీసుకున్నా ఇప్పుడు పట్టించుకోవట్లేదు సెలబ్రిటీస్. అయితే విజయ్ మీద కూడా గతంలో చాలా రూమర్స్ వచ్చాయి. విజయ్ కూడా వాటిని పట్టించుకోలేదు. కానీ ఈసారి మాత్రం తన సాయం చేసే విషయంలో.. ఛారిటీ విషయంలో తప్పుడు కథనాలు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసాడు. అంతే కాదు ఒక స్పెషల్ వీడియో కూడా తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. టాలీవుడ్ మొత్తం విజయ్ కు సపోర్ట్ గా వచ్చింది. మెగా స్టార్ నుండి ప్రతి ఒక్కరు మద్దతుగా నిలుస్తామని తెలిపారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తప్పుడు వార్తలపై విజయ్ ఆగ్రహం - విజయ్ కు మద్దతుగా ఇండస్ట్రీ..!

ఏ విషయాన్నైనా ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పడం రౌడీ హీరో విజయ్ కు మొదటి నుండి అలవాటే. ఆ యాటిట్యూడ్ నచ్చే విజయ్ ను అంతలా ఇష్టపడతారు ఫ్యాన్స్. యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక తాజాగా మరోసారి విజయ్ దేవరకొండ తనపై తప్పుడు వార్తలు రాస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరోనా వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందించేలా ‘ది దేవరకొండ ఫౌండేషన్’ స్థాపించి అందులో ‘మిడిల్ క్లాస్ ఫండ్’తో సహాయక కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఫౌండేషన్ ద్వారా నిత్యావసర వస్తువులు కూడా లేక భాదపడుతున్న ఎంతో మందికి సాయం అందిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మరో డిఫరెంట్ మూవీ కి విజయ్ గ్రీన్ సిగ్నల్

సెన్సేషనల్ చిత్ర హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ " (వర్కింగ్ టైటిల్ ) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మరో షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ కానున్న ఈ మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. "ఫైటర్ " మూవీ తరువాత సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందే మూవీ కి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న విజయ్, పూరి మూవీ

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ఫైటర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో స‌రికొత్త పాత్ర‌లో దర్శనమివ్వనున్నాడు విజయ్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నాయికగా నటిస్తుండగా.. ప్రముఖ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది.

Team TFNవాట్సాప్

షేర్